మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్‌ను తెచ్చేందుకు మరో 3 ఆక్సిజన్ ట్యాంకర్లు ఒడిశాకు బయల్దేరాయని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ఆక్సిజన్ ట్యాంకర్లను యద్ధ విమానాలు, రైల్వే ద్వారా పంపించడాన్ని రవాణా శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి ప్రభుత్వం ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.
అందులో భాగంగా ఒడిశా నుంచి ఆక్సిజన్ దిగుమతి కోసం ఇవాళ మధ్యాహ్నం 44 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంకర్లను యుద్ధ విమానాల ద్వారా ప్రభుత్వం పంపించింది. వీటికి సంబంధించిన ఆక్సిజన్ ట్యాంకర్లను రవాణా శాఖ సమకూరుస్తోంది. సాయంత్రం మరో 2 నుంచి 3 ఆక్సిజన్ ట్యాంకర్లను కూడా పంపించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: రష్యా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న స్పుత్నిక్-వి టీకాలు