ఎంసెట్ ఇంజినీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్ ఈనెల 24 నుంచి నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభం కావల్సి ఉన్నందున 24 నుంచి తుది విడత ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన గడువు నేటితో ముగిసింది. సుమారు పదివేల మంది ఇంజినీరింగ్ సీటు వచ్చినప్పటికీ కాలేజీల్లో చేరలేదు. వారందరూ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి జాతీయ సంస్థలతో పాటు డీమ్డ్, ప్రైవేట్, ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల్లో చేరినట్లు తెలుస్తోంది. మొదటి విడత తర్వాత ఇంజినీరింగ్లో 16 వేల 432 సీట్లు, బీఫార్మసీలో 3 వేల 193, ఫార్మాడీలో 505 సీట్లు... మొత్తం కలిపి 20 వేల 310 సీట్లు మిగిలాయి. సీటు పొందిన వారు కాలేజీల్లో చేరకపోవడం వల్ల మిగిలిన సుమారు పదివేల సీట్లతో కలిపి.. దాదాపు 30వేల సీట్లను తుది విడత కౌన్సెలింగ్ లో భర్తీ చేయనున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 75 శాతం లోటు వర్షపాతం