ETV Bharat / state

వచ్చేనెల నుంచి 57నిండిన వారికి కూడా 'ఆసరా' - తెలంగాణ బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

దేశంలో సంక్షేమం కోసం అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆర్థిక మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. పేదలకు అండగా నిలిచే ఆసరా పింఛన్ల కోసం బడ్జెట్​లో రూ.11,758 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు.

telangana state budget
ఆసరా పింఛన్ల కోసం రూ.11,578 కోట్ల నిధులు
author img

By

Published : Mar 8, 2020, 2:55 PM IST

అసహాయులైన పేదలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఆసరా పింఛన్లను అందిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్​ వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులకు అందించే పింఛన్ల​ మొత్తాన్ని రూ. 1000 నుంచి 2,016లకు.. వికలాంగుల పెన్షన్​ రూ.15 వందల నుంచి రూ. 3,016కు పెంచిందని గుర్తు చేశారు.

ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 57 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్​​ అందించబోతుందనే శుభవార్తను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నానన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఆసరా పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుందన్నారు. గత బడ్జెట్​లో ఆసరా పింఛన్లకు రూ.9,402 కోట్ల నిధులు కేటాయించగా.. ఈ బడ్జెట్​లో రూ.11,758 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు.

ఆసరా పింఛన్ల కోసం రూ.11,578 కోట్ల నిధులు

పంచాయతీలకు పెద్దపీట... రూ.23,005 కోట్లు కేటాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.