ETV Bharat / state

భాగ్యనగరంలో రూ.426 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్‌, ఫ్లైఓవ‌ర్

జంటనగరాల పరిధిలో ఈనెల 11న రూ.426 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఎలివేటెడ్ కారిడార్‌, మ‌రో ఫ్లైఓవ‌ర్ అందులో ఉన్నాయని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు.

elevated-corridor-and-flyover-with-rs-426-crore-in-hyderabad-city
భాగ్యనగరంలో రూ.426 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్‌, ఫ్లైఓవ‌ర్
author img

By

Published : Jul 9, 2020, 9:57 PM IST

జంటనగరాల పరిధిలో రూ.426 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఈనెల 11న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. 350 కోట్లతో ఇందిరాపార్కు నుంచి వీఎస్​టీ వరకు మొద‌టి ద‌శలో నిర్మించ‌నున్న నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జిని నిర్మించాలని తలపెట్టారు.

మ‌రో రూ.76 కోట్లతో రాంన‌గ‌ర్ నుంచి బాగ్‌లింగంప‌ల్లి వరకు ఫేజ్-2లో మూడు లేన్ల ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జిని నిర్మించ‌నున్నారు. ఈ ప‌నులు 24 నెల‌ల్లో పూర్తి చేయాలనే లక్ష్యంగా నిర్ణయించారు.

ఆ బ్రిడ్జి అందుబాటులోకి రావటం ద్వారా ఇందిరా పార్కు నుంచి వీఎస్​టీ జంక్షన్ వ‌ర‌కు ట్రాఫిక్‌ రద్దీతోపాటు ప్రయాణ స‌మ‌యం త‌గ్గుతుందన్నారు. హిందీ మ‌హా విద్యాల‌య‌ం, ఉస్మానియా యూనివ‌ర్సిటీల వైపు ట్రాఫిక్ స‌మ‌స్య తొలగిపోతుందని బొంతు రామ్మోహన్‌ చెప్పారు.

ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య

ఇందిరాపార్క్, అశోక్‌న‌గ‌ర్, ఆర్టీసీ కాల‌నీ క్రాస్ రోడ్స్​, బాగ్‌లింగంప‌ల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య తొలుగుతుందన్నారు. రాంన‌గ‌ర్ నుంచి వ‌యా వీఎస్‌టీ ఆజామాబాద్ ద్వారా బాగ్‌లింగంప‌ల్లి వ‌ర‌కు ఫ్లైఓవ‌ర్ నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. దీని పొడ‌వు 850 మీట‌ర్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామని అన్నారు. నిర్మాణ వ్యయం రూ.76 కోట్లుగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అందుబాటులోకి వస్తే.. రాంన‌గ‌ర్ నుంచి బాగ్‌లింగంప‌ల్లి వ‌ర‌కు ట్రాఫిక్ ర‌ద్దీ స‌మ‌స్య ఉండదని వివరించారు.

ఇదీ చూడండి : హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు... ఆ దారుల్లో వాహన రాకపోకలకు నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.