హైదరాబాద్లోని కార్మిక శాఖ కార్యాలయం ముందు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ మీటర్ కార్మికులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,600ల మంది మీటర్ రీడింగ్ కార్మికులు ఉన్నారని.. అనేక సంవత్సరాలుగా తాము ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు పెంచాలని, 30 రోజులు పని దినాలు కల్పించాలని కోరారు. పీస్ రేటు విధానం రద్దు చేయాలని, కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్హత ఉన్న వారిని ఆర్టిజన్లుగా గుర్తించాలని విద్యుత్ మీటర్ కార్మికులు కోరారు.
ఇదీ చదవండి: శ్రీశైలం ప్రమాదం’పై మరోసారి సిబ్బంది విచారణ