ETV Bharat / state

డెవలప్‌మెంట్‌ ఛార్జీలతో విద్యుత్ శాఖ అదనపు వడ్డింపు - విద్యుత్​ శాఖలో డెవలప్​మెంట్​ ఛార్జీలు

గత మూడు నెలలుగా డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరిట విద్యుత్‌ శాఖ అదనంగా వడ్డిస్తోంది. ఒక ఇంట్లో విద్యుత్‌ ఉపకరణాలు వినియోగించే శక్తి మొత్తాన్ని ఎనర్జీ లోడ్‌ అంటారు. వాడే ఉపకరణాలు పెరిగితే లోడ్‌ పెరుగుతుంది. ఒక కిలోవాట్‌కు కనెక్షన్‌ తీసుకుని రెండు కిలోవాట్లు వినియోగిస్తే.. అదనపు కిలోవాట్‌కు డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరిట రూ.2,836 వసూలు చేస్తారు

power charges
power, electricity bill
author img

By

Published : Apr 11, 2021, 7:33 AM IST

హన్మకొండకు చెందిన గుండా సుధాకర్‌ (76) చిరు వ్యాపారి. కిరాణా దుకాణం నడుపుతున్నారు. నెలకు సగటున రూ.400-500 విద్యుత్‌ బిల్లు చెల్లిస్తుంటారు. ఈ సారి ఆయనకు రూ. 533.18 బిల్లు రాగా.. దానికి అదనంగా డెవలప్‌మెంటు ఛార్జీల పేరిట రూ.2,832 చెల్లించాలని తాఖీదు పంపారు. ఇంత బిల్లు ఎలా కట్టాలంటూ ఆయన ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థల పరిధిలో పలువురు వినియోగదారులది ఇదే పరిస్థితి.

గత మూడు నెలలుగా డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరిట విద్యుత్‌ శాఖ అదనంగా వడ్డిస్తోంది. ఒక ఇంట్లో విద్యుత్‌ ఉపకరణాలు వినియోగించే శక్తి మొత్తాన్ని ఎనర్జీ లోడ్‌ అంటారు. ఉపకరణాలు పెరిగితే.. లోడ్‌ అధికమవుతుంది. ఏసీకి 1000-3000 వాట్లు, కంప్యూటర్‌ 100-250, వాటర్‌ హీటర్‌ 550-1500, మిక్సీ 150-750, ఫ్రిజ్‌ 60-250, బల్బులు 5-60, సీలింగ్‌ ఫ్యానుకు 50-150 వాట్ల విద్యుత్‌ ఖర్చవుతుంది. వాడే ఉపకరణాలు పెరిగితే లోడ్‌ పెరుగుతుంది. ఒక కిలోవాట్‌కు కనెక్షన్‌ తీసుకుని రెండు కిలోవాట్లు వినియోగిస్తే.. అదనపు కిలోవాట్‌కు డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరిట రూ.2,836 వసూలు చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.400 కలిపి మొత్తం రూ.3,236 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంపై కొన్నిచోట్ల కిరాయిదారులకు, ఇంటి యజమానులకు మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. అద్దెకున్నవారే చెల్లించాలని యజమానులు చెబుతుండగా.. బిల్లు వరకు తాము చెల్లిస్తామని, డెవలప్‌మెంట్‌ ఛార్జీలతో తమకు సంబంధం లేదని అద్దెదారులు వాదిస్తున్నారు.

విద్యుత్‌శాఖ ఏమంటోంది?

సాధారణంగా మీటరు తీసుకునేటప్పుడు లోడ్‌ను బట్టి కనెక్షన్‌ ఇస్తారు. ఎవరైనా వినియోగదారులు కనెక్షన్‌ తీసుకున్నప్పటి కంటే ఎక్కువ విద్యుత్‌ వాడుతున్నట్టయితే మీటర్‌ రీడింగ్‌లో ఉండే రికార్డెడ్‌ మ్యాగ్జిమం డిమాండ్‌ (ఆర్‌ఎండీ) ద్వారా ఈ విషయం బయటపడుతుంది. దీన్ని బట్టి డెవలప్‌మెంటు ఛార్జీలు వసూలు చేస్తారు. ‘‘వినియోగదారు కనెక్షన్‌ పొందే సమయంలో వాడుతున్న ఉపకరణాల సామర్థ్యాన్ని బట్టి లేదా వినియోగదారు కోరుకున్న లోడ్‌తో సర్వీసు మంజూరు చేస్తారు. దీన్నే ఒప్పంద లోడ్‌ అంటారు. ఆపై ఉపకరణాల సంఖ్య పెరగటం వల్ల తగిన డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించి ఈ లోడ్‌ను పెంచుకోవాల్సి ఉంది. గత నవంబరు, డిసెంబరు నెలల్లో అదనపు లోడ్‌ వినియోగిస్తున్న కొందరు వినియోగదారులను గుర్తించాం. వారికి ఫిబ్రవరి, మార్చి నెలల బిల్లుల్లో ఛార్జీలు విధించాం’’ అని ఓ డిస్కం ఉన్నతాధికారి వివరించారు. ‘‘విద్యుత్‌ వినియోగం పెరిగినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్‌పై లోడు పెరుగుతుంది. దాని స్థాయి పెంచకపోతే లోవోల్టేజీ సమస్య తలెత్తుతుంది. లోడ్‌ ఎంత ఉందో తెలిస్తేనే మౌలిక సదుపాయాలను మెరుగుపరచగలుగుతాం’’ అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్ యువతికి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.