విద్యుత్ శాఖ తమ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. కరెంట్ ఉద్యోగులకు 4.02 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్ దారులకు, ఉద్యోగులకు గతంలో 8.866గా ఉన్న డీఏను 12.886గా పెంచినట్లు ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.
జనవరి, ఫిబ్రవరికి పెరిగిన డీఏను మార్చి జీతంతో కలిపి చెల్లించనున్నట్లు ప్రభాకర్ రావు వెల్లడించారు. డీఏ పెంచడం వల్ల ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు.
ఇవీ చూడండి: ఎన్95 మాస్క్ ఒక్కోటి రూ.300