ETV Bharat / state

Election Training To Police Officers : 'ఎన్నికల సమయంలో భద్రతా నిర్వహణకు పోలీసులు కొత్త వ్యూహాలు, సాంకేతికతలను ఉపయోగించాలి' - Who is tamilanadu election ceo

Election Training To Police Officers in Hyderabad : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్​లో పోలీసు అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్​కే భవన్​లో జరిగిన శిక్షణకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు.

700 police Tranffer due to elections
Meeting on Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 9:48 PM IST

Election Training To Police Officers in Hyderabad : కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి రాష్ట్రంలో 700 మంది పోలీసులను బదిలీ చేసిందని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. సరిహద్దుల్లో 80 నుంచి 85 చెక్​పోస్ట్​లను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా పోలీసు అధికారులకు వివిధ అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ బీఆర్​కే భవన్​లో జరిగిన శిక్షణకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్, డీజీపీ అంజనీకుమార్, పశ్చిమబంగాల్, తమిళనాడు ఎన్నికల సీఈఓలు ఆరిజ్​అఫ్తాబ్, సత్యబ్రత సాహూ వివిధ అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు.

Telangana Election CEO Vikas Raj Speech : ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా సాగేలా అనుసరించాల్సిన భద్రతా విధానాలపై ప్రధానంగా దృష్టి సారించారు. మారుతున్న సాంకేతికతలు కొత్త సవాళ్లను విసురుతున్నాయని సీఈఓ వికాస్​రాజ్(Vikas Raj) అన్నారు. మీడియాలో విస్తృతంగా ఎన్నికల కవరేజ్, వీలైనంత త్వరగా తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని.. రాష్ట్రంలో ఉన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో భద్రతా నిర్వహణకు పోలీసు అధికారులు కొత్త వ్యూహాలు, సాంకేతికతలను ఉపయోగించాలని పేర్కొన్నారు.

Chief Election Officer on Assembly Elections 2023 : 'డబుల్ ఓట్ల తొలగింపు.. ఓటింగ్ శాతం పెంచడమే మా ప్రధాన లక్ష్యాలు'

DGP Anjani Kumar Speech on Election Process : ఎన్నికల సంఘం ఆదేశాలకు అనగుణంగా రాష్ట్రంలో దాదాపు 700 మంది పోలీసు సిబ్బందిని బదిలీ చేశారని అంజనీకుమార్ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశాలతో అంతర్‌ రాష్ట్ర సరిహద్దుల వెంట 80 నుంచి 85 చెక్​పోస్టులను ఏర్పాటు చేశారని వివరించారు. క్లోజ్డ్- సర్క్యూట్ కెమెరాలతో అనుసంధానించిన ఈ చెక్​పోస్టులు భద్రతా చర్యలను బలోపేతం చేస్తాయని వెల్లడించారు. ఎన్నికల సమయంలో నగదు, మద్యం అక్రమ రవాణా, అనుమానిత వాహనాల తనిఖీ, పోలింగ్ స్టేషన్ల నిర్వహణ తదితర భద్రతా సంబంధిత అంశాలను డీజీపీ తెలిపారు.

Tamil Nadu Election CEO Instructions : ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఉత్తమ విధానాలు, పారదర్శకత పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎన్నికల ముందు సన్నాహకాలపై పశ్చిమ బెంగాల్‌ సీఈఓ ఆరిజ్​ అఫ్తాబ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలింగ్ స్టేషన్ల వర్గీకరణ, సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల వర్గీకరణ తదితరాల అంశాల గురించి చర్చించారు. పోలింగ్ ప్రారంభం నుంచి చివరి వరకు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను అఫ్తాబ్ వివరించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల అవసరం, మోహరింపు.. ఇతర విషయాల గురించి తమిళనాడు సీఈఓ(Tamilnadu Election CEO) సత్యబ్రత సాహూ చెప్పారు. రాష్ట్ర పోలీసులను మోహరించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలు, వ్యయ పర్యవేక్షణ, సంబంధిత అంశాలపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. ఆయా రంగాల్లో వినూత్న విధానాలను పాటిస్తే మంచి ఫలితాలు రావచ్చని సత్యబ్రత సాహూ ఆశా భావం వ్యక్తం చేశారు.

Telangana CEO Vikasraj Interview : 'ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లు తొలగిస్తాం'

Telangana Assembly Elections Schedule 2023 : అక్టోబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌

BRS MLA Ticket Issue In Adilabad District : కారులో కుదుపులు.. ఇంతకీ వారి పయనం ఎటువైపో..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.