ETV Bharat / state

Telangana Assembly Elections 2023 : వేగం పుంజుకున్న అసెంబ్లీ ఎన్నికల కసరత్తు.. వాటిపై ప్రత్యేక దృష్టి - తెలంగాణ ఎన్నికలపై ఎన్నికల ఎక్సర్​సైజ్​

Assembly Elections In Telangana : శాసనసభ ఎన్నికల కసరత్తు మరింత వేగవంతం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం బృందం సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. ఓటర్ల జాబితా, ఓటరు గుర్తింపు కార్డుల అంశంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. ఇటీవలి కర్ణాటక ఎన్నికల నిర్వహణ తీరును అధ్యయనం చేసేందుకు.. రాష్ట్రం నుంచి అధికారుల బృందం త్వరలో అక్కడ పర్యటించనుంది.

telangana election
telangana election
author img

By

Published : Jun 28, 2023, 3:53 PM IST

Election Exercise In Telangana : నవంబర్ లేదా డిసెంబర్​లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం ఇటీవలే హైదరాబాద్​లో మూడు రోజుల పాటు పర్యటించి ఎన్నికల సన్నద్ధతను సమీక్షించింది. ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, సన్నద్ధత, సన్నాహకాలను జిల్లాల వారీగా సమీక్షించింది. ఆయా జిల్లాల్లో ఇప్పటి వరకు చేసిన కసరత్తు, ప్రత్యేకించి ఓటర్ల జాబితా సంబంధిత అంశాలు, బీఎల్ఓల ద్వారా ఇంటింటి పరిశీలనపై ఈసీ ప్రతినిధులు ఎక్కువగా దృష్టి సారించారు. కొన్ని జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన వివరాలపై వారు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఆయా జిల్లాల సమాచారం, వివరాలు ఏ మాత్రం పొంతన లేవని కేంద్రం ఎన్నికల సంఘ బృందం వ్యాఖ్యానించారు. 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులు తదితరాలకు సంబంధించిన సమాచారం సరిగా లేదని అభిప్రాయపడ్డారు. బీఎల్ఓల ఇంటింటి పరిశీలనపైనా ఈసీ ప్రతినిధులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బీఎల్ఓలతో జరిపిన సమావేశంలోనూ కొందరి సమాధానాలపై సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం.

అన్ని జిల్లాల్లో ప్రారంభమైన ఎన్నికల కసరత్తు : ఈసీ సమీక్ష అనంతరం ఎన్నికల కసరత్తును జిల్లాల్లో మరింత వేగవంతం చేయనున్నారు. ఓటర్ల జాబితా, చిరునామాల అప్​డేషన్, బీఎల్​ఓల ద్వారా ఇంటింటి పరిశీలన, డూప్లికేట్ ఓట్ల తొలగింపు ప్రక్రియ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, తదితర అంశాలపై తక్షణమే దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించారు.

Central Election Commission Visited Hyderabad : అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నిక సంఘ బృందం స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ రెండో దఫా కసరత్తు సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జూలై 24 తేదీ లోగా పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు ప్రక్రియ, తప్పుగా ముద్రించిన ఫొటోల సవరణ, పోలింగ్ కేంద్రాల విభజనకు అనుమతి, తదితర ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆగస్టు రెండో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురించాలి. అభ్యంతరాలు, వినతులు స్వీకరించిన అనంతరం అక్టోబర్ నాలుగో తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది.

Central Election Commission Is Preparing For Telangana Elections : ఈ కసరత్తును పకడ్బందీగా చేయాలని, ఎక్కడా ఎలాంటి లోపాలకు తావు లేకుండా చూడాలని యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలను కేంద్ర ఎన్నికల బృందం జారీ చేశారు. అటు ఇటీవల కర్ణాటక శాసనసభ ఎన్నికల నిర్వహణా విధానాన్ని రాష్ట్ర అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నేతృత్వంలోని బృందం త్వరలోనే అక్కడ పర్యటించనుంది. సీఈఓ కార్యాలయంలో ఖాళీల భర్తీ కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. అధికారులు, సిబ్బందిని త్వరలోనే నియమిస్తారని అంటున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.