ETV Bharat / state

Election CREA-THON 2023 Contest : ఓటర్లను ఆకర్షించే పోస్టర్​, వీడియో రూపొందించండి.. రూ.20 వేలు గెలుచుకోండి..

Election CREA-THON 2023 Contest : ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఓటు హక్కు నమోదును ప్రోత్సహించేలా.. ఎవరైనా లోగో, వీడియోను చేసి రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి పంపిస్తే వారు నగదు ఇవ్వనున్నారు. ఈసారి ఎలాగైనా ఓటరు శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో.. ఈ రకంగా హాకథాన్​ కార్యక్రమానికి నిర్వహించాలనుకుంది. మరి ఇది ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Telangana Assembly Election 2023
Telangana Election Commission
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2023, 2:31 PM IST

Updated : Sep 3, 2023, 2:50 PM IST

Election CREA-THON 2023 Contest : ఓటుహక్కు నమోదును ప్రోత్సహించేలా ఆకర్షణీయంగా పోస్టర్ రూపొందించినా.. వీడియో చేసినా రూ.20 వేల వరకు గెలుపొందే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం(State Election Commission) ఇందుకోసం క్రియేథాన్(Creathon) పేరిట ప్రత్యేకంగా హాకథాన్(Hackathon) నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడంతో పాటు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఆధ్వర్యంలో వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  • This election season, let your creative instincts run wild!!
    CEO Telangana in partnership with HYSEA and Code Tantra has launched “Election Crea-thon 2023”.
    Design a poster or video to encourage citizens to enrol for voting and win Rs. 20k.@ECISVEEP @rajivkumarec @HYSEA1991 pic.twitter.com/MxccvgUAqW

    — CEO Telangana (@CEO_Telangana) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈసీ కీలక ఆదేశాలు.. ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయం భారీగా తగ్గింపు

Rs 20 Thousand Prize Designed Election Postal to Attract Voters : ఎన్నికలు ఎప్పుడైనా పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు, యువత.. ఓటు కోసం అంత ఆసక్తి చూపడం లేదు. ఐటీ రంగంలో ఉన్న వారు కూడా అంతంత మాత్రంగానే ముందుకొస్తున్నారు. దీంతో ఆయా వర్గాల వారిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా హాకథాన్ నిర్వహిస్తున్నారు. హైసియా, కోడ్ తంత్రతో కలిసి క్రియేథాన్ పేరిట ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా ప్రోత్సహించేలా ఆకర్షణీయమైన, వినూత్నంగా ఉండేలా, సృజనాత్మకంగా పోస్టర్ తయారీ, వీడియో రూపొందించాలన్నది పోటీ.

Telangana Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలకు వేళాయే.. కసరత్తు షురూ చేసిన సీఈసీ

Telangana Assembly Election 2023 : తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో వీటిని తయారు చేయవచ్చు. 5 ఎంబీకి మించకుండా పోస్టర్, 60 సెకన్లకు మించకుండా వీడియో ఉండాలి. విజేతలకు రూ.20 వేల నగదును బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ నెల 16 వ తేదీ వరకు పోస్టర్, వీడియోలు పంపేందుకు గడువు నిర్దేశించారు. ఇప్పటికే ఎన్నికల సంఘం వివిధ కార్యక్రమాలను ఓటర్లకు అవగాహన కల్పించేందుకు రూపొందిస్తున్నాయి. అన్ని అక్రమ మార్గాలను అరికట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసుకుంది. ఓటర్లకు డబ్బులు పంచడం, మద్యం వంటి అనేక అక్రమాలను నిషేధించేందుకు చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ఓటర్లను చైతన్య పరచడానికి ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లను చేస్తోంది.

అక్టోబరు రెండో వారంలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్​? : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారాను మోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. శాసనసభ ఎన్నికలకు ముహుర్తాన్ని ఖరారు చేసేందుకు విస్తృతంగా కసరత్తును మూడు నెలల నుంచి చేస్తోంది. ఇందుకు గానూ అక్టోబరు రెండో వారంలోగా షెడ్యూల్​ను విడుదల చేసేందుకు సమాయత్తమయ్యింది. ఈ క్రమంలో ఎన్నికల స్థితిని అధ్యయనం చేసేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్​ రాజీవ్​ కుమార్​ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం తెలంగాణకు వచ్చేందుకు ఏర్పాట్లను చేసుకున్నారు. వీరు అక్టోబరు మొదటి వారంలో వచ్చే వీలుంది.

Telangana Assembly Elections 2023 : వేగం పుంజుకున్న అసెంబ్లీ ఎన్నికల కసరత్తు.. వాటిపై ప్రత్యేక దృష్టి

Telangana Assembly Elections 2023 : 'ఆ కేంద్రాల్లో సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయండి'

Last Updated : Sep 3, 2023, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.