ETV Bharat / state

Election Commission Officials Visit To Telangana : ఎన్నికల వ్యయం పెంచండి.. ఈసీకి రాజకీయ పార్టీల విజ్ఞప్తి - తెలంగాణలో పర్యటించిన ఎన్నికల సంఘం

Election Commission Officials Visit To Telangana : రాబోయే ఎన్నికల ఏర్పాట్ల కోసం హైదరాబాద్​లో పర్యటిస్తున్న ఎన్నికల సంఘం ఇవాళ పలు అంశాలపై దృష్టి సారించింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రతినిధులు హైదరాబాద్‌లో రాజకీయపార్టీల నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ ప్రచారంపై వివిధ పార్టీల అభిప్రాయాలు, సమస్యలు, ఫిర్యాదులు అడిగి తెలుసుకున్నారు.

Election Commission Officials
Election Commission Officials Visit To Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 8:01 PM IST

Election Commission Officials Visit To Telangana : శాసనసభ ఎన్నికల సమయం దగ్గర పడడంతో రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం ఊపందుకొంది. రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం (Election Commission) కూడా ఆ దిశగా చర్యల్ని వేగవంతం చేసింది. గతంలోనే ఒకమారు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. ఇవాళ మరోసారి పర్యటించింది. ఓటర్ల జాబితా (Votor List), ఈవీఎంల సన్నద్ధం, అధికారులకు శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించింది. రానున్న వారం, పది రోజుల్లోపు ఎన్నికల ప్రకటన (Election Schedule) వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ బృందం 3 రోజుల పాటు హైదరాబాద్​లో పర్యటిస్తోంది.

EC Focus on Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ఫోకస్.. విచ్చలవిడి వ్యయానికి అడ్డుకట్ట వేసేందుకు పక్కా ప్లాన్

ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రతినిధులు (EC Officials MEEt With Political Party Leaders) రాజకీయ పార్టీల నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాపై అభిప్రాయాలను సేకరించారు.

BRS Leaders Meet With EC Officials : బీఆర్​ఎస్ తరపున రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల గుర్తుల విషయంలో తమకున్న అభ్యంతరాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆటో, ట్రక్కు, రోడ్డురోలర్‌ గుర్తుల వల్ల కారు గుర్తుకు కలుగుతున్న నష్టాన్ని వివరించామని ఈ గుర్తుకు సంబంధించిన తమ పిటిషన్‌ను రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నియమ నిబంధనలు తెలుగులోకి కూడా అనువదించాలని కోరినట్లు తెలిపారు.

Congress Leaders Meet With EC Officials : దరఖాస్తులు అన్నీ పరిష్కరించే వరకు రేపు ఓటర్ల తుది జాబితా ప్రకటించవద్దని కోరామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఈసీ ప్రతినిధులతో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్‌ ఖాన్‌ సమావేశమైన వీరు రాబోయే ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఓటర్లకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు ఓటరు జాబితా ప్రకటించవద్దని కోరినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

"కొన్ని నియోజకవర్గాల్లో బోగస్ ఓట్ల గురించి వారితో మాట్లాడాము. తెలంగాణలో ఫ్రీ ఫైర్ ఎన్నికలు జరపాలంటే మద్యం, డబ్బుల డిస్ట్రిబ్యూషన్ అపాలని తెలిపాము. వాటిని వీలైనంత వరకు వాటిని అపడానికి ప్రయత్నించాలని కోరాము. గతంలో డబ్బుల పంపకంపై వచ్చిన ఆరోపణలను వారి దృష్టికి తీసుకెళ్లాము." - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ

Election Commission Officials Visit To Telangana ఎన్నికల వ్యయం పెంచండి.. ఈసీకి రాజకీయ పార్టీల విజ్ఞప్తి

BJP Leaders Meet With EC Officials : రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు కేంద్ర బలగాలను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపాలని... ఎక్కువ మంది పరిశీలకులను నియమించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులను కూడా నియమించాలని తెలిపారు. ఈసీ ప్రతినిధులతో ప్రధానంగా ఓటర్ల జాబితాలో లోపాల గురించి వివరించినట్లు ఓం పాఠక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పులు చేస్తోందని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు.

BRS MPS Letter To EC About Party Symbol : 'ఈసారైనా ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు కేటాయించకండి'

సమావేశానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్‌, ఆమ్‌ ఆద్మీపార్టీ రాష్ట్ర కన్వీనర్‌ దిడ్డి సుధాకర్, సీపీఎం నుంచి డీజీ నర్సింహా రావు, నంద్యాల నర్సింహా రెడ్డిలతో ఈసీ అధికారులు సమావేశమయ్యారు. ఒక ఇంట్లోని ఓటర్లు అందరూ ఒకే పోలింగ్ కేంద్రంలోనే ఉండేలా చూడాలని ఎన్నికల వ్యయం పెంచాలని పలువురు నేతలు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలని తెలిపినట్లు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు రాఘవేంద్ర ప్రతాప్‌ తెలిపారు.

Election Commission Officials Visit To Telangana : ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని... ఆధార్‌ కార్డును ఓటర్‌ (Voter Id Aadhar link) ఐడీతో ఖచ్చితంగా అనుసంధానించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ కోరారు. పోలింగ్​కు మూడు రోజుల ముందు వరకు కూడా ఓటర్ల నమోదు జరగాలని సీపీఎం పార్టీకి చెందిన నర్సింహా రావు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో (EC Conditions On ELections Campaign) మద్యం అమ్మకాలు నిలిపివేయాలన్నారు. ఓటరు జాబితా సమగ్రంగా ప్రక్షాళన జరగాలని కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ముగిసిన అనంతరం.. ఈసీ ప్రతినిధులు ఎన్​ఫోర్స్​మెంట్ ఏజెన్సీలతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణా చర్యలపై సమీక్ష నిర్వహించారు.

Voter Awareness Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. పోలింగ్ శాతం పెంచడంపై స్పెషల్ ఫోకస్

BSP Leaders Meet With EC Officials : రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నాయకులు విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారని ఈసీ నిఘా పెట్టాలని బీఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయార్య అన్నారు. ఈసీ ప్రతినిధులతో సమావేశమైన విజయార్య.. ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలను పూర్తి వివరించినట్లు తెలిపారు.

Telangana Assembly Elections 2023 : ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఈసీ కసరత్తు

Congress Leaders Meet With Election Commission Officials : ప్రభుత్వ డబ్బుతో ఓట్ల కొనుగోలు ప్రయత్నాలు ఆపాలని కోరినట్లు కాంగ్రెస్‌ నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.