జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 25లోపు ఓటరు స్లిప్‌ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ అన్నారు. అధికారులంతా పారదర్శకంగా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు దాదాపు 45వేల మంది సిబ్బంది అవసరమని వీరితోపాటు మైక్రో అబ్జర్వర్‌లు, వెబ్‌కాస్టింగ్ వాలంటీర్ల నియామకం వెంటనే పూర్తి చేయాలని కోరారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని లోకేశ్‌కుమార్ స్పష్టం చేశారు. రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రదేశాల్లో పార్టీలు, నాయకులకు సంబంధించిన ఫొటోలున్న బ్యానర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయ్యిందన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన దాదాపు 19 వేల బ్యాలెట్ బాక్స్‌ల పరిశీలన పూర్తి చేశామని లోకేశ్ కుమార్ వివరించారు.
ఇదీ చదవండి : గ్రేటర్ నగారా: డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు