ETV Bharat / state

తమ్ముడిపై కొడవలితో దాడిచేసిన అన్న - హైదరాబాద్

తమ్ముడిపై అన్న కొడవలితో దాడి చేసిన ఘటన హైదరాబాద్​లో కలకలం రేపింది. అన్నదమ్ముల మధ్య తలెత్తిన భూవివాదమే ఈ ఘటనకు కారణామని పోలీసులు తెలిపారు.

hyderbad
author img

By

Published : Jul 14, 2019, 4:44 PM IST

హైదరాబాద్​ రాజేంద్ర నగర్​ పోలిస్​ స్టేషన్​ పరిధిలోని ఉప్పర్​పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ అన్న తమ్ముడిపై కత్తితో దాడిచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సామ చంద్రశేఖర్​ రెడ్డిపై సామ సుభాష్​రెడ్డి కత్తితో దాడిచేయడం వల్ల చేతికి తీవ్ర గాయలయ్యాయి. దాడిని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించి...పోలీసులకు సమాచారం అందించ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...నిందితుడితోపాటు అతని కుమారుడు, అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
బోరుబావి నుండి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. తాము పంచుకున్న ఆస్తులను తిరిగి ఇవ్వాలని పలుమార్లు దాడులకు పాల్పడ్డాడని చంద్రశేఖర్​ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎప్పటికైనా సుభాష్​ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని వాపోయారు. నిందితుడి పై సెక్షన్ 326 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తమ్ముడిపై కొడవలితో దాడిచేసిన అన్న

ఇవీ చూడండి:ఇంటర్​ ద్వితీయ సంవత్సర సప్లీ​ ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.