కరోనా లాక్డౌన్ కారణంగా విద్యారంగమే ఎక్కువ నష్టపోయిందని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ అన్నారు. ఆన్లైన్ క్లాసుల కోసం మొబైల్ ఫోన్లు కొనలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థినిలకు ఫస్ట్ ఆమ్ సంస్థ సహకారంతో.. ఏకలవ్య ఫౌండేషన్ మొబైల్ ఫోన్లను అందజేసింది. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ స్కూల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. నగరంలోని పలు బస్తీలకు చెందిన 100 మంది పాఠశాలల విద్యార్థినిలకు చరవాణిలు పంపిణీ చేశారు.
లాక్డౌన్ కారణంగా అనేక మంది మధ్యతరగతి కుటుంబాలు చితికి పోయాయని... ముఖ్యంగా బాలికల విషయంలో మరీ దారుణంగా తయారైందని హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఏ. రామలింగేశ్వర రావు అన్నారు. స్కూళ్లు మూతబడటంతో ఆడపిల్లలకు బాల్య వివాహాలు జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినిల చదువు కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, అక్షయ విద్య ఛైర్మన్ వివేక్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర అవార్డులు: ఎర్రబెల్లి