రాష్ట్రంలో పేదలందరికీ మెరుగైన వైద్యం అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంస్కరణలు అమలు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి అధికారులతో సమావేశమైన ఆయన వర్షాకాలంలో అటవీ ప్రాంత ప్రజలకు జ్వరాల నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొబైల్ ఆస్పత్రులు, వైద్యులతో వైద్యం అందించాలని తెలిపారు. తెరాస పాలనలో బోధన ఆస్పత్రుల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 65 ఏళ్లకు పెంచామని గుర్తుచేశారు. హెల్త్ కార్డులు, ఆరోగ్యశ్రీకి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు వివరించారు.
ఇదీ చూడండి : 'కేసీఆర్.. జగన్ను చూసి నేర్చుకో : నారాయణ'