సొంత ఇళ్లు, ఫ్లాట్, విల్లా కొనే ఆలోచనలో ఉన్నారా... తక్కువ ధరలు, నమ్మకమైన ప్రాపర్టీలు చూసే నగరవాసుల కోసం ఈనాడు మెగాప్రాపర్టీషో వచ్చేసింది. ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 3రోజుల పాటు నిర్వహించే ఈ ప్రాపర్టీషో కొండాపూర్లోని సైబర్ కన్వెన్షన్లో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ప్రారంభించనున్నారు. ఇందులో అన్ని వర్గాల వారి స్థిరాస్తి అవసరాలకు సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో ఉంటుంది. ఆదివారం వరకు సాగే ఈ ప్రాపర్టీషో కు ప్రవేశం ఉచితం. ఉదయం పది గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రాపర్టీ స్టాళ్లను సందర్శించవచ్చు.
ఇవీ చూడండి:వేలిముద్రలు పడకుంటే... ఆసరా లేనట్లేనా?