మహాత్మా గాంధీ కలలుగన్న సచ్ఛభారత్ నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరు బాధ్యతగా ప్లాస్టిక్ను నిషేధించాలని న్యూ ఇయర్ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ సూచించారు. 150వ గాంధీ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్లాస్టిక్ నిషేధం కార్యక్రమంలో భాగంగా... హైదరాబాద్ చిక్కడపల్లిలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సమాజంలో విద్యావంతులు పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారని శ్రవణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థలు కోరారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ "వైష్ణవ జన తో" గీతానికి ప్రధాని అభినందనలు