ETV Bharat / state

రెండో రోజూ గ్రానైట్‌ కంపెనీలపై ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..! - ED raids in TRS MP Gayatri Ravi office

ED raids in telangana
ED raids in telangana
author img

By

Published : Nov 10, 2022, 10:25 AM IST

Updated : Nov 10, 2022, 8:18 PM IST

08:23 November 10

రెండో రోజూ గ్రానైట్‌ కంపెనీలపై ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..!

ED raids in telangana : రాష్ట్రంలో గ్రానైట్‌ కంపెనీలపై ఈడీ అధికారుల దాడులు రెండో రోజూ కొనసాగాయి. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, కరీంనగర్‌లోని పలు గ్రానైట్ కంపెనీలకు చెందిన యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన అధికారులు.. పలు డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వీటన్నింటినీ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. వాటిని విశ్లేషించిన తర్వాత ఈడీ అధికారులు సంబంధిత గ్రానైట్ కంపెనీల యజమానులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించే అవకాశం ఉంది. హవాలా, మనీ లాండరింగ్, నిబంధనలకు విరుద్ధంగా ఎగుమతులు చేసినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత సదరు గ్రానైట్ కంపెనీల యజమానులను బాధ్యులు చేసే అవకాశం ఉంది.

ED raids in Hyderabad : బుధవారం రోజునా రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీ, ఆదాయ పన్ను-ఐటీ శాఖ అధికారుల తనిఖీలు జరిగాయి. ఓవైపు దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనిఖీలు, విచారణ కొనసాగుతుండగానే.. తాజాగా కొన్ని గ్రానైట్‌ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలతో ఈడీ, ఐటీ శాఖ అధికారులు రాష్ట్రంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

కరీంనగర్‌లోని 9 గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని పేరాల శేఖర్‌ రావు.. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్​జీటీ, కేంద్ర పర్యావరణశాఖకు... గతేడాది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించారు. అదే విషయంపై 2019లో బండి సంజయ్‌ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ రెండు ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈడీ, ఐటీ శాఖ అధికారులు 20 బృందాలుగా విడిపోయి హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మంలోని గ్రానైట్‌ సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ సోమాజీగూడలోని.. పీఎస్​ఆర్ గ్రానైట్స్ కార్యాలయం, హైదర్‌గూడ ఉప్పరపల్లిలోని.. ఎస్​వీజీ గ్రానైట్స్ అధినేత ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేశారు.

Last Updated : Nov 10, 2022, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.