ED Seized MS Alphageo Fixed Deposits: ఎంఎస్ ఆల్ఫాజియో ఇండియా లిమిటెడ్‌కి సంబంధించి రూ.16కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ సీజ్ చేసింది. నిబంధనకు విరుద్ధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు నిధులు బదిలీ చేశారన్న సమాచారం ఆధారంగా 2019లో కేసు నమోదు చేసిన ఈడీ.. గతంలో సోదాలు నిర్వహించింది. తాజాగా సంస్థకు చెందిన డిపాజిట్లను నిలుపుదల చేసింది. కేసు దర్యాప్తులో పలు కీలక అంశాలను ఈడీ గుర్తించింది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆల్ఫాజియో సంస్థ.. దేశ, విదేశాల్లో ఆయిల్ కంపెనీలకు ఆయిల్ లభ్యత, నిర్వహణకు సంబంధించిన సర్వేలు చేస్తోంది. ఇందుకోసం ఫ్రాన్స్, సింగపూర్, నెదర్లాండ్స్ నుంచి పరికరాలను దిగుమతి చేసుకుంటుంది. వీటికి తప్పుడు బిల్లులు సృష్టించి హవాలా రూపంలో యూఏఈకి నగదు మళ్లిస్తోందని ఈడీ అధికారులు గుర్తించారు.
పలు సంస్థల నుంచి పరికరాలు దిగుమతి చేసుకున్న చెల్లింపులను మ్యాట్రిక్స్ గ్రూప్ డీఎంసీసీ అనే బోగస్ సంస్థ ద్వారా చేస్తోంది. అల్ఫాజియో సంస్థ ఎండీ దినేష్ అల్లాకు అనుకూలంగా ఈ బోగస్ పేమెంట్ సంస్థను రాజీవ్ సక్సేనా అనే చార్టెడ్ ఎకౌంటెంట్ నడుపుతున్నట్టు ఈడీ గుర్తించింది. యూఏఈలోని హవాలా ముఠాలతో సంబంధాలు కొనసాగిస్తూ ఇప్పటి వరకు 25.34 లక్షల యూఎస్ డాలర్ల చెల్లింపులు ఫెమా నిబంధనలకు విరుద్ధంగా చేసినట్టు ఈడీ గుర్తించింది.
ఇవీ చదవండి: