ETV Bharat / state

ఏపీలో పీఎఫ్​ఐ సంస్థ నేతల ఇళ్లపై ఈడీ దాడులు.. - ap news

ఏపీలోని కర్నూలు జిల్లాలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ సంస్థ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి చెందిన నేతల ఇళ్లే లక్ష్యంగా తనిఖీలు చేశారు.

ఏపీలో పీఎఫ్​ఐ సంస్థ నేతల ఇళ్లపై ఈడీ దాడులు..

author img

By

Published : Mar 24, 2021, 8:50 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నంద్యాల, ఎమ్మిగనూరులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌.. సోదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ సంస్థ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో పనిచేసే నాయకుల ఇళ్లే లక్ష్యంగా..... తనిఖీలు నిర్వహించారు. నంద్యాలతో పాటు కానాల, అయ్యలూరులోని పలువురి ఇళ్లలో... క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఈ పార్టీలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే కోణంలో ఆరా తీశారు. వారి బ్యాంకు పుస్తకాలు,....ఆస్తులు, ఆదాయ వివరాలను పరిశీలించారు.

ఈడీ సోదాల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ర్యాపిడ్ యాక్షన్​ఫోర్స్ బృందాలతోపాటు స్థానిక పోలీసులు పెద్దఎత్తున తరలిరావడంతో... స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో పోరాడుతున్న రైతుల ఉద్యమానికి మద్దతిచ్చినుందుకే తమపై కేంద్రం కక్ష సాధిస్తోందని పీఎఫ్​ఐ నాయకులు ఆరోపించారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.

నంద్యాల కేంద్రంగా గతంలో పీఎఫ్ఐ నాయకుల ఇళ్లలో పలు దఫాలు సోదాలు.. జరిగినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఆందోళనలు జరిగే ప్రమాదం ఉండటంతో...కేంద్ర బలగాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచదవండి: మితిమీరిన వేగం.. తీసిన నిండు ప్రాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.