ETV Bharat / state

కరోనా వేళ.. రాష్ట్రంలో 52 కేంద్రాల్లో ఈసెట్ పరీక్ష - ecet exam in telangana conducted successfully

కరోనా విపత్కర పరిస్థితుల మధ్య రాష్ట్రంలో సోమవారం ఈసెట్​ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈసెట్​ కోసం తెలంగాణలో 52, ఏపీలో 4 కేంద్రాల్లో సుమారు 25 వేల మంది హాజరయ్యారు. కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా అధికారులు కట్టడి నిబంధనలు పాటిస్తూనే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోని అనుమతించారు.

ecet examination held in telangana state
కరోనా వేళ.. రాష్ట్రంలో 52 కేంద్రాల్లో ఈసెట్ పరీక్ష
author img

By

Published : Aug 31, 2020, 6:27 PM IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితుల మధ్య పలుమార్లు వాయిదా పడిన ప్రవేశ పరీక్షలు.. సోమవారం ఈసెట్​తో ప్రారంభమయ్యాయి. పాలిటెక్నిక్​ డిప్లొమా చదివిన విద్యార్థులు.. ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు.. జేఎన్​టీయూహెచ్​ ఇవాళ ఆన్​లైన్ విధానంలో ఈసెట్​ నిర్వహించింది. ఈసెట్​ కోసం తెలంగాణలో 52, ఏపీలో 4 కేంద్రాల్లో సుమారు 25 వేల మంది హాజరయ్యారు.

కరోనా నేపథ్యంలో కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి థర్మల్​ స్క్రీనింగ్​ చేసి.. కొవిడ్​ నెగిటివ్ డిక్లరేషన్​ చూపించాకే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. కేంద్రాల్లోకి మంచినీటి బాటిల్, శానిటైజర్, గ్లౌజులు, మాస్కులను అనుమతించారు. మాస్కులు లేని విద్యార్థులకు కేంద్రాల్లో మాస్కులు అందించారు. థర్మల్​ స్క్రీనింగ్​లో ఉష్ణోగ్రత ఎక్కువ వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక గదిలో పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్ ఓనం: వేడుకల్లో అబ్బురపరిచిన చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.