శ్రద్ధ పెట్టి పనిచేయాలి...
కార్యాలయం వాతావరణం ఇంట్లో ఉంటుందని భావించరాదు. ఏవో అవాంతరాలు కలుగుతూనే ఉంటాయి. వీటికి ముందే సిద్ధపడాలి. ఆమేరకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో కూడా కార్యాలయ వాతావరణం కల్పించుకోవాలి. తప్పనిసరి పరిస్థితులు కావడం వల్ల కార్యాలయంలో మాదిరిగానే శ్రద్ధ పెట్టి పనిచేయాలి.
పొగుడుతూ.. పనిచేసే సమయం పెంచుకోవచ్చు...
పిల్లలను రోజంతా ఒకే పని మీద కూర్చోబెడితే విసుగు చెందుతారు. వ్యాయామం, రోజువారీ పనులు, విశ్రాంతి, కొత్త విషయాలు నేర్చుకోవడం ఇలా రోజువారీ కార్యక్రమాలను నాలుగు విభాగాలుగా విభజించాలి. తద్వారా వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపొచ్చు. పని ఒత్తిడితో పిల్లలపై అరవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. వారిని పొగుడుతూ ఉంటే పని చేసుకునేందుకు సహకరిస్తారు. వారికి రోజులో కొంత సమయం కేటాయించాలి. కాసేపు వారితో ఆడుకోవాలి. తర్వాత పని ఉందని చెప్పి పజిల్స్, మెదడుకు మేత ఇవ్వడంతో పాటు పుస్తకాలు చదివించడంతోపాటు ఆకర్షించే మాటలు చెప్పాలి. తద్వారా కంప్యూటర్ వద్ద మీ స్క్రీన్‌టైమ్ పెంచుకోవచ్చు.
కలసికట్టుగా..
దంపతులిద్దరూ ఉద్యోగులే అయితే పరస్పరం సహకరించుకోవాలి. ఇంటి పనిలోనూ, పిల్లలను సముదాయించడంలో ఈ చొరవ అవసరం. ఒకరికి కార్యాలయం పని ఉన్నప్పుడు మరొకరు వీటి బాధ్యత తీసుకోవాలి. అత్యవసర సమావేశాలు, వీడియోకాల్స్ ఉంటే ముందే చర్చించుకోవాలి.
నచ్చిన వేళ ఎంచుకోండి
ఏ సమయంలో మీరు సమర్థంగా పని చేయగలరో ముందే గుర్తించండి. పిల్లలు తింటున్న సమయంలోనో, వారు నిద్రించే సమయాన్నో ఎంచుకోవడం మంచిది. పిల్లలు ఏ సమయంలో విశ్రాంతి తీసుకుంటారో ఆ సమయంలో పని చేసుకోవడం ఉత్తమం.
ఇదీ చూడండి: 'అదుపులోనే ఉంది.. అయినా మరో మూడువారాలు తప్పదు'