ETV Bharat / state

TS EAMCET Councelling From Today : నేటి నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ - తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు

TS Engineering Counselling Schedule 2023 : ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. నేటి నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. ఎల్లుండి నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఇంజినీరింగ్ సీట్లు ఖరారు కాలేదు.

TS EAMCET Councelling From Today
TS EAMCET Councelling From Today
author img

By

Published : Jun 26, 2023, 8:55 AM IST

Telangana EAMCET Counselling From Today : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం ఇవాళ్టి నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో ఈ నెల 28 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ నెల 28 నుంచి జులై 8 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తారు. సీటు వచ్చిన అభ్యర్థులు జులై 12 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

EAMCET Counselling Dates 2023 : జులై 21 నుంచి 24 వరకు రెండో విడత ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ జరుగుతుంది. జులై 28న రెండో విడత ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తారు. ఆగస్ట్ 2న తుది విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలి. ఆగస్టు 7న ఇంజినీరింగ్ తుది విడత సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు ఉంటుంది. ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తారు.

EAMCET Counselling Dates 2023 TS : ఈ నెల 28 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావలసి ఉండగా.. ఇప్పటి వరకు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయో తేలలేదు. జేఎన్టీయూహెచ్, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయలేదు. రేపు సాయంత్రం వరకు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది సుమారు లక్ష ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Polytechnic First Phase Counselling : మరోవైపు.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు పూర్తైంది. మొత్తం 116 కాలేజీల్లో 29 వేల 396 సీట్లకు గానూ 21 వేల 367 సీట్లను భర్తీ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో 87.44 శాతం, ప్రైవేటు కాలేజీల్లో 60.46 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సైబర్‌ సెక్యూరిటీ డిప్లొమా కోర్సుకు సంబంధించి మొత్తం సీట్లు భర్తీ కాగా.. జౌళి సాంకేతిక డిప్లొమా కోర్సులో 64 సీట్లకు గానూ కేవలం 9 మంది విద్యార్థులే చేరారు. సీట్లు పొందిన విద్యార్థులు జులై 7 నుంచి 10 వరకు తమకు కేటాయించిన కళాశాలల్లో చేరాలని, చేరని వారి సీట్లను రద్దు చేస్తామని పాలిసెట్ కన్వీనర్ తెలిపారు. 15 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి..

TS EAMCET: ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ శాశ్వతంగా రద్దు.. జీవో జారీ

TS Engineering counseling schedule 2023 : ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.