జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లో అపోలో... క్రెడిల్ కార్యక్రమం నిర్వహించింది. బాలికలకు సరైన పోషకాహారం అందడం లేదని గైనకాలజిస్ట్ డా.జయశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. రుతుక్రమ సమయంలో స్త్రీలల్లో రక్తహీనత పెరగుదల, కోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. సరైన అవగాహన లేకే మూత్రనాళాలు ఇన్ఫెక్షన్కు గురవుతున్నారని గుర్తు చేశారు.
అవగాహన లేకుంటే అంతే సంగతి...
కొందరికి సమస్యపై అవగాహన లేక అధిక రక్తస్రావంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆడపిల్లలకు విటమిన్స్, కాల్షియం, ప్రొటీన్లు అందించాలని సూచించారు. పోషకాహారం సక్రమంగా తీసుకుంటేనే పిల్లలు ఆరోగ్యంగా జన్మిస్తారని ఈ సందర్భంగా వివరించారు.
ఇవీ చూడండి : అందరికీ ఉపాధి, ఉద్యోగమే లక్ష్యం: కేంద్రమంత్రి