ETV Bharat / state

హైదరాబాద్​లో మొదటి రోజు ముగిసిన కార్​ రేసింగ్​.. మళ్లీ అవే తప్పిదాలు!

E Formula One race has ended on first day: భాగ్యనగరంలో మొదటి రోజు ఇండియన్​ రేసింగ్​ లీగ్​ ముగిసింది. గత నెల మాదిరిగానే ఈసారి కూడా రేస్‌ నిర్వహణలో ఆలస్యం జరిగింది. రేసింగ్​ నిర్వహణలో గందరగోళం నెలకొంది. క్వాలిఫైయింగ్ పోటీలను రేపే నిర్వహించే యోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.

car racing
కార్​ రేసింగ్​
author img

By

Published : Dec 10, 2022, 7:05 PM IST

Updated : Dec 10, 2022, 10:30 PM IST

E Formula One race has ended on first day: హుసేన్ సాగర్ తీరాన రయ్యిమంటూ దూసుకుపోయే ఫార్ములా కార్ రేసింగ్ లీగ్ ఫైనల్స్​కు హైదరాబాద్ వేదికైంది. ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్స్ మొదటి రోజు మెయిన్ రేస్ పోటీలు జరగలేదు. 2.7 కిమీల హైదరాబాద్​ స్ట్రీట్ సర్క్యూట్​లో ఈరోజు కేవలం రెండు ఫ్రీ ప్రాక్టీస్ రేస్​లను మాత్రమే నిర్వాహకులు నిర్వహించారు. ఆదివారమే అన్ని పోటీలు పెట్టే యోచనలో నిర్వహకులు ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్​ నగరంలో జరుగుతున్న ఇండియన్​ రేసింగ్​ లీగ్​

మొదటి రోజు ఉదయం 11గంటలకు ప్రారంభంకావలసిన రేసింగ్.. ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయితే ఉదయం 11గంటలకు ఒక ఫ్రీ ప్రాక్టీస్ సెషన్.. మధ్యాహ్నం 1గంటకు రెండవ ఫ్రీ ప్రాక్టీస్ సెషన్లు జరిగాల్సి ఉండగా.. అవి కాస్త చాలా ఆలస్యంగా 4 గంటలు తర్వాత జరిగాయి. మధ్యాహ్నం రేసింగ్​ ప్రారంభమైన తరవాత రెండు కార్లు రేస్ మధ్యలో ఆగిపోవడంతో రెండుసార్లు రెడ్‌ ఫ్లాగ్స్‌ వచ్చాయి.

సాంకేతిక కారణాలతో స్పోర్ట్స్‌ కార్లు చాలా ఆలస్యంగా ట్రాక్ ఎక్కాయి. రేపు ఇండియన్ రేసింగ్‌ లీగ్‌లో మూడు క్వాలి ఫైయింగ్ రేస్​లు ఉంటాయి. రేపు జరిగే ఇండియన్ రేసింగ్ క్వాలిఫైయింగ్ పైనే అందరి చూపు ఉంది. రేసింగ్​ను చూసేందుకు వచ్చే వీక్షకులు ఇవాళ తక్కువగానే ఉన్నా... రేపు పెద్ద మొత్తంలో హాజరు అవుతారన్న ఆశాభావం ​ నిర్వాహకుల్లో ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 10, 2022, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.