దేశంలోనే అతిపెద్దదైన హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచంలో మూడో పెద్ద కేబుల్ బ్రిడ్జిగా దుర్గం చెరువు రికార్డు సృష్టించింది. 234 మీటర్ల పొడవైన స్పాన్ నిర్మాణంతో మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై మిగిలి ఉన్న ఫుట్‌పాత్‌లు, సైకిలింగ్ ట్రాక్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పనులు రూ.184 కోట్లతో చేపడుతున్నారు.
ఇవీ చూడండి: 3 వేల 50 కోట్లతో కాళేశ్వరం పదో ప్యాకేజీ పనులు