ETV Bharat / state

కరోనాను తరిమికొట్టేందుకు ఊరంతా పసుపు నీళ్లు!

రోగాలను అరికట్టడంలో పసుపు చేసే మేలు మనకెంతో తెలుసు. యాంటీ బయోటిక్​గా, యాంటీ వైరల్​గా, యాంటీ కేన్సర్​ ఏజంట్​గా పని చేస్తుందని ఎన్నో పరిశోధనల్లో నిరూపితమైంది. అలాంటి విశేషమైన గుణాలున్న పసుపును గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామస్తులు కరోనా వైరస్​ ప్రబలకుండా ఉపయోగిస్తున్నారు. పసుపు నీళ్లతో కరోనా వైరస్​ రాదనే నమ్మకంతో ఊరంతా చల్లారు.

Turmeric
Turmeric
author img

By

Published : Mar 28, 2020, 5:19 PM IST

కరోనాను తరిమికొట్టేందుకు ఊరంతా పసుపు నీళ్లు!

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు.. యాంటీ బయోటిక్‌ లక్షణాలున్న పసుపు కలిపిన నీళ్లను రహదారులపై చల్లించారు. దుగ్గిరాల పసుపు వ్యాపారుల సంఘం సహకారంతో... స్థానికులు వినూత్న ప్రయోగం చేశారు.

కరోనా క్రిమి సంహారానికి పసుపు ఉపయోగపడుతుందని తాము నమ్ముతున్నామని వ్యాపారులు చెప్పారు. ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే కరోనాను ఎదుర్కోగలమని వ్యాపారులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: పురుషులు, వృద్ధులకే కరోనా సోకే అవకాశం ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.