ETV Bharat / state

'కరోనా వచ్చినా... డ్రంక్‌ ఆండ్‌ డ్రైవ్‌ పరీక్షలు ఆగవు' - హైదరాబాద్​ తాజా వార్తలు

రాష్ట్రంలో కరోనా కలకలం నేపథ్యంలో డ్రంక్‌ ఆండ్‌ డ్రైవ్‌ పరీక్షలు ఉండవంటూ సామాజిక మాధ్యమాల్లో ఆకతాయిలు ప్రచారం చేస్తున్నారు. సమాచారం తెలిసిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అదంతా తప్పుడు సమాచారమని, తనిఖీలు యథాతథంగా కొనసాగుతాయని ట్విట్టర్​ ద్వారా స్పష్టం చేశారు.

Drunk and drive test same as in telangana
డ్రంక్‌ ఆండ్‌ డ్రైవ్‌ పరీక్షలు యథాతథం
author img

By

Published : Mar 4, 2020, 7:44 PM IST

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు నిర్వహిస్తున్న తనిఖీలు యథాతథంగా కొనసాగుతాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. కరోనా అనుమానితులు పెరుగుతున్న తరుణంలో తనిఖీలను నిలిపేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని అంజనీ కుమార్ ట్విట్టర్​ ద్వారా స్పష్టం చేశారు. వాహనదారులను తనిఖీ చేసే సమయంలో ఒక్కో వాహనదారుడికి ఒక్కో స్ట్రా ఉపయోగిస్తున్నామన్నారు. దీనివల్ల సమస్యలు తలెత్తే అవకాశం లేదని అంజనీ కుమార్ పేర్కొన్నారు.

ట్రాఫిక్ పోలీసులకు కూడా అన్ని రకాల జాగ్రత్తలు సూచించామని అన్నారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని వెల్లడించారు. రోజూ నగరంలోని పలుచోట్ల డ్రంక్‌ ఆండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేపడుతున్నామని అన్నారు. మోతాదుకు మించి మద్యం సేవించినట్లైతే వాహనదారులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

Drunk and drive test same as in telangana
డ్రంక్‌ ఆండ్‌ డ్రైవ్‌ పరీక్షలు కొనసాగుతాయని ట్విట్టర్​ ద్వారా స్పష్టం

ఇదీ చూడండి : రైతుల ఆవేదన.. వినియోగదారుడికి ఆనందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.