ETV Bharat / state

సముద్రంలో డ్రోన్​ లభ్యం.. అప్రమత్తమైన అధికారులు.!

Drone found floating in water: సముద్ర తీరప్రాంత మత్స్యకారులకు డ్రోన్ చిక్కింది. సమాచారం తెలుసుకున్న మెరైన్ పోలీసులు ఆ డోన్​ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్​కు సంబంధించి వివరాల కోసం వైమానిక, రక్షణదళ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

drone
డ్రోన్​ లభ్యం
author img

By

Published : Feb 2, 2023, 6:39 PM IST

Updated : Feb 2, 2023, 10:58 PM IST

సముద్రంలో మత్స్యకారులకు దొరికిన డ్రోన్​

Drone found floating in water in AP: వారంతా చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి చేపలను పట్టి జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే వారికి సముద్రంలో దూరంగా వారికి కొత్త వస్తువు కనబడింది. అది గమనించిన మత్య్సకారులు మొదట దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. ఆ తరువాత ధైర్యం చేసి దగ్గరకు వెళ్లగా.. అది డ్రోన్​గా గుర్తించారు. వెంటనే సమాచారాన్ని మెరైన్ పోలీసులకు అందించారు. అనంతరం ఆ డ్రోన్​ని ఒడ్డుకు చేర్చారు. మెరైన్ సీఐ డ్రోన్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్ర తీరప్రాంత మత్స్యకారులకు వైమానిక రక్షణ దళ డ్రోన్ చిక్కింది. మూలపేట సమీపంలో సముద్రంలో తేలుతున్న విమానాన్ని పోలి ఉండే ఈ డ్రోన్​ను భావనపాడు జెట్టీకి చేర్చి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్టేషన్​కు సమాచారం అందించారు. 9 అడుగుల పొడవు, 111కిలోల బరువున్న ఈ డ్రోన్​పై బన్సీ టార్గెట్ 8081 అని ఆంగ్లంలో ఉండగా.. జనవరి 28, 2023 అని మార్కర్​తో రాసి ఉంది. దీన్ని భావనపాడు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్​లో భద్రపరిచారు.

వైమానిక పరిశోధనల్లో భాగంగా టార్గెట్ డ్రోన్​గా ప్రయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీని పైభాగంలో ప్యారాచూట్ ఉంది. ప్రయోగ సమయంలో విఫలమై తీరానికి చేరుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి తమకు ఎటువంటి సమాచారం లేదని, స్వదేశానికి చెందిన డ్రోన్​గా ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని మెరైన్ సీఐ జి.దేవుళ్లు తెలిపారు. దీనిపై నేవీ, కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం అందించామన్నారు.

'భావనపాడు దగ్గరలోని సముద్రంలోకి మత్య్సకారులు నిన్న చేపల వేటకు వెళ్లారు. ఈ డ్రోన్​ను వారు సముద్రంలో గమనించారు. దాని గురించి మత్య్సకారులు.. మత్స్యశాఖకు చెందిన అధికారులతో పాటు మాకు సమాచారం అందించారు. వెంటనే మేము అక్కడికి వెళ్లాము. వారి వద్ద నుంచి ఆ డ్రోన్​ను స్వాధీనం చేసుకున్నాం. ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిన విషయంలో స్పష్టత లేదు. విదేశాలకు చెందినది కాదనుకుంటున్నాం. నేవీ, రక్షణ అధికారలకు సమాచారం ఇచ్చాం. త్వరలో వారు వచ్చి పరిశీలించిన తరువాత వివరాలు వెల్లడిస్తాం.'- జి.దేవుళ్లు, మెరైన్ సీఐ

ఇవీ చదవండి:

Last Updated : Feb 2, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.