హైదరాబాద్లో డ్రైవర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ల సేవలను ఆర్టీసీ అధికారులు కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కలిపి సుమారు 17,354 మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారని ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సేవలందిస్తోన్న.. రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి, రీజనల్ స్థాయిలో ఉత్తమ డ్రైవర్లను ఎంపిక చేసి ఆయా డిపోల్లో సత్కరించారు. ఇందులో భాగంగా.. హైదరాబాద్ కంటోన్మెంట్ డిపోలో డ్రైవర్లు ర్యాలీ తీశారు. అనంతరం వారికి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తామని డ్రైవర్లు తెలిపారు.
ఇదీ చదవండి:కేటీపీపీ-2లో నిలిచిన విద్యుత్తు ఉత్పత్తి