ETV Bharat / state

మదిని దోచే కేకులు.. కంటికే కాదు నోటికీ పసందైన విందు - తెలంగాణ వార్తలు

Dream cakes academy : పుట్టిన రోజు, పెళ్లిరోజు, కొత్త సంవత్సరం, వీడ్కోలు ఇలా వేడుక ఏదైనా అందమైన కేక్ కట్ చేయటం సంప్రదాయంగా మారిపోయింది. కేకులకు మరింత అందంగా తీర్చిదిద్దటమే కేక్ ఆర్టిస్ట్ పని. భారత్‌లో ఇప్పుడిప్పుడే కేక్ ఆర్టిస్టులకు ఆదరణ పెరుగుతోంది. పదిహేనేళ్ల క్రితమే ఈ రంగంలోకి అడుగుపెట్టి...ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటమే కాదు...తనలాంటి వారికి మార్గం చూపేందుకు ఏకంగా ఓ ఇనిస్టిట్యూట్ స్థాపించారు హైరాబాద్‌కి చెందిన అశ్విని. ఉమెన్స్ డే సందర్భంగా అశ్విని సక్సెస్ స్టోరీని మీరూ చదవండి..

Dream cakes academy, cake designs
మదిని దోచే కేకులు.. కంటికే కాదు నోటికీ పసందైన విందు
author img

By

Published : Mar 8, 2022, 9:37 AM IST

మదిని దోచే కేకులు.. కంటికే కాదు నోటికీ పసందైన విందు

Dream cakes academy : అందంగా అలంకరించిన పూలు...మదిని దోచేస్తున్నాయి కదూ. కంటికే కాదు నోటికీ పసందైన విందును ఇవ్వటం వీటి ప్రత్యేకత. కేకుపై పేర్చిన పూలను లొట్టలేసుకుంటూ తినొచ్చు... నచ్చిన వారికి బొకేలుగా మార్చి బహుమానంగా అందించొచ్చు. ఇలా కేకులతో పాటు వాటి డిజైనింగ్‌నే వృత్తిగా ఎంచుకున్నారు హైదరాబాద్‌కు చెందిన అశ్విని. ఐటీ ఉద్యోగాన్ని వదిలి కేక్ ఆర్టిస్ట్ కోర్సును అమెరికాలో నేర్చుకున్నారు. కేకులను మరింత శోభాయమానంగా మార్చుకోవాలన్న ఆలోచనతో న్యూయార్క్ కలినరీ ఎడ్యుకేషన్ నుంచి బేకింగ్‌లో, కేకుల తయారీలో పట్టా పొందారు. డే కేక్ తయారీ పోటీల్లో పాల్గొని తొలి స్థానంలో నిలిచాక పూణెలో డ్రీమ్ కేక్స్ పేరుతో డిజైనర్ కేక్ బొటిక్‌ని స్థాపించారు.

అమ్మ మా చిన్నతనంలో కేకులను ఇంట్లో రుచిగా తయారుచేసేది. అప్పటి నుంచే వాటి తయారీపై ఆసక్తి పెరిగింది. అందుకే కేకు ఆర్ట్‌ కోర్సుల్లో శిక్షణ పొంది దీన్నే వృత్తిగా ఎంచుకున్నాను. చాలామంది మహిళలు నేర్చుకునేందుకు ఆసక్తి ఉన్నట్లు గమనించాను. వాళ్లు సొంతగా వ్యాపారంలో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో డ్రీమ్‌కేక్స్‌ అకాడమీ స్థాపించాను. ఆన్‌లైన్‌లో తరగతులు బోధిస్తున్నాను. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆన్​లైన్ శిక్షణకు విద్యార్థులు హాజరవుతున్నారు.

-అశ్విని, డ్రీమ్ కేక్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు

variety cakes : హైదరాబాద్‌కి మకాం మార్చిన అశ్విని కేక్ ఆర్ట్ పట్ల మక్కువ ఉన్నవారి ఆసక్తిని గమనించి.. ఆన్‌లైన్‌లో డ్రీమ్ కేక్స్ అకాడమీ ప్రారంభిచారు. దేశంలో మొదటి ఆన్ లైన్ కేక్ అకాడమీ ఇదే. తర్వాత ఆఫ్‌లైన్‌లోనూ సేవలు ప్రారంభించారు . పదివేలమంది విద్యార్థులకు అకాడమీ ద్వారా తర్ఫీదునిచ్చారు . చక్కెరతో నిజమైన పూలను తలపించే కేక్ డిజైన్లు చేయటం అశ్విని ప్రత్యేకత. కేక్‌ డిజైనింగ్‌ ముడిసరుకును స్వయంగా సమకూర్చుకుని అనేక ప్రయోగాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు . పూలకు సహజత్వం తీసుకురావటానికి రంగులను మేళవించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. బొకేలుగా, డైనింగ్ టేబుల్ డెకరేషన్‌కు వినియోగించవచ్చని చెబుతున్నారు.

కేకు ఆర్ట్‌లో వారికి తలెత్తే అనుమానాలను ఆన్‌లైన్‌లో, ఫోన్‌ ద్వారా నివృత్తి చేస్తున్నా. కొంతమందికి వీడియోకాల్‌ ద్వారా సేవలందిస్తున్నాం. నేర్చుకున్న కోర్సుకు అనుగుణంగా కేకు డిజైనింగ్‌లో వివిధ రుచులతో ప్రయోగం చేయాలి. అపుడే వారు వృత్తిలో మరింత మెరుగ్గా రాణిస్తారు. తాజాగా ఉండటం వల్లే ఇంట్లో తయారుచేసే కేకులనే అందరు ఎక్కువగా ఇష్టపడతారు.

online cake making training : యూకే కేక్ మాస్టర్స్ మ్యాగజైన్​కి ఎంపికైన పదిమంది ఉత్తమ కేక్ ఆర్టిస్టుల్లో రెండుసార్లు అశ్విని ఎంపికయ్యారు. అంతర్జాతీయ టీవీ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఆమె... నచ్చిన రంగంలో అడుగుపెడితే విజయం తప్పక వరిస్తుందని ధీమాగా చెబుతున్నారు.

ఇదీ చదవండి: Ration Shops in Telangana: చౌకధరల దుకాణాల్లో ఇంటర్నెట్, పౌరసేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.