రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఎండీగా డాక్టర్ ఎస్.రామచందర్ నియమితులయ్యారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని సమాఖ్య కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. పశుసంవర్థక శాఖలో అదనపు సంచాలకులుగా పని చేస్తున్న ఆయన పదోన్నతిపై వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తుల అభివృద్ధి కోసం చేపట్టిన భారీ గొర్రెల అభివృద్ధి పథకం పకడ్బందిగా అమలయ్యేలా చూస్తానని ఆయన అన్నారు.
రాష్ట్రంలో జీవాల పెంపకం దారులైన గొల్ల కురుమల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రామచందర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మార్కెటింగ్ కోసం సౌకర్యాలు కల్పించి... గొర్రెలు, మేకల మాంసం పరిశ్రమల ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దాని ద్వారా గొల్ల కురుమల ఆదాయాలు పెంచడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఇదీ చదవండి: నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ రీఓపెన్