ETV Bharat / state

అంబేడ్కర్​కు సంబంధించిన స్థలాలను పంచ తీర్థాలుగా చేశాం: కిషన్​ రెడ్డి - తెలంగాణ భాజపా తాజా వార్తలు

హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పిచారు. ఆ మహనీయుని‌ ఆశయాలకు అనుగుణంగా దేశంలో పాలన జరుగుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

amb
ambhetkar birth annevercry
author img

By

Published : Apr 14, 2021, 12:36 PM IST

అంబేడ్కర్‌కు సంబంధించిన స్థలాలు, ప్రాంతాలన్నింటిని పంచతీర్థాలుగా చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ ఫోటో పెట్టించిన ఘనత కూడా భాజపాదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కిషన్ రెడ్డితోపాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్​ చిత్రపటానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, మాజీ ఎంపీలు వివేక్‌, విజయశాంతి నివాళి అర్పించారు. సీఎం కుర్చీ తన ఎడమ కాలి చెప్పుతో సమానమని... ముఖ్యమంత్రి కేసీఆర్​ రాజ్యాంగాన్ని అవమానించారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుపెట్టుకోవాలన్నారు. కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల పాలనకు చరమగీతం పాడాలన్నారు.

అంబేడ్కర్​కు నివాళి అర్పించే సమయమే లేదా..?

ఎన్నికల ప్రచారంలో వెళ్లేందుకు సమయమున్న ముఖ్యమంత్రి కేసీఆర్​కు అంబేడ్కర్​కు నివాళి అర్పించే సమయం లేదా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆక్షేపించారు. రాష్ట్రంలో 150 అడుగుల అంబేడ్కర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి.. కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి: త్వరలోనే హైదరాబాద్​లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.