సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బృందంతో కలిసి హైదరాబాద్ నగరంలో నిర్మాణమవుతున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పరిశీలన రేపు కూడా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పేదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ ఇళ్లను డిజైన్ చేశారన్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించిన తరువాత మీడయాతో మాట్లాడిన ఆయన వెస్ట్ మారేడుపల్లిలో హౌసింగ్ బోర్డ్ స్థలాన్ని పేదల కోసం కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నామని తెలిపారు.
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని తలసాని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 60 చోట్ల నిర్మాణం అవుతున్నట్లు మంత్రి తెలిపారు. వందశాతం ఉచితంగా ఇస్తున్నామని, అందరి సమక్షంలోనే పేదలకు పంపిణీ చేస్తామన్నారు. కరోనా వల్ల పనులన్నీ ఆలస్యం అవుతున్నాయని, లక్ష ఇళ్లు చూపించే వరకు భట్టిని వెంట పెట్టుకుని తిరుగుతానని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి : ఎన్నిరోజులైనా లక్ష ఇళ్లను పరిశీలిస్తాం: భట్టి విక్రమార్క