రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజుకు బోధన రుసుముతో ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. బోధన రుసుములతో లింక్ లేకుండా పరీక్ష ఫీజును తీసుకోవాలని కళాశాలల ప్రధానోపాధ్యాయులకు పరీక్షల నియంత్రణాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
పరీక్షల ఫీజును ఎలాంటి షరతులు లేకుండా అంగీకరించాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోర్డు ఇచ్చినా ఉత్తర్వులను పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.