కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దని.. అత్యవసరమైతే తప్ప వెళ్లకూడదని సూచించింది. మార్కెట్లు, రైతుబజార్లు, కిరాణ దుకాణాలు, సూపర్ మార్కెట్ల వద్ద భౌతిక దూరం దూరం పాటించాలని పేర్కొంది. బయటకు వచ్చిన వారు మాస్కులు, చేతి గ్లౌజులు తొడుక్కోవాలని అధికారులు సూచించారు. చాలా మంది ఆయా దూకాణాల వద్ద నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు.
దుకాణాల వద్ద
ప్రధానంగా కిరాణ దుకాణాలు, రైతుబజార్లు, మధ్యాహ్న భోజనాలు సరఫరా చేసే ప్రాంతాల్లో ఏ మాత్రం దూరం పాటించడం లేదు. ఉదయం సమయాల్లో పెద్ద ఎత్తున ఆయా దుకాణాలకు తరలివస్తున్న వినియోగదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని ఎంత చెబుతున్నప్పటికీ బేఖాతరు చేస్తున్నారు. బేగంబజార్, నాంపల్లి, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మెహదీపట్నం రైతుబజార్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
భోజనాల సరఫరా సమయంలో
స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు మధ్యాహ్నం సమయంలో భోజనాలు సరఫరా చేయడానికి వస్తున్నప్పుడు భౌతిక దూరం లేకుండానే క్యూలో నిలబడుతున్నారు. నిర్వాహకులు ఎంత చెబుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. రైతుబజార్లు, కిరాణ దుకాణాలు, ఇతర నిత్యావసర దుకాణాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముఖానికి మాస్కు, చేతికి గ్లౌజులు ధరించి విధిగా భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని వైద్యు నిపుణలు చెబుతున్నారు.
ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్