ETV Bharat / state

కేఫే ద లోకో రెస్టారెంట్... కుక్కలకు మాత్రమే

చూడగానే నోరూరిపోయే కుకీస్... కేకులు... బిర్యానీ... ఇలా 30 రకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి ఈ రెస్టారెంట్​లో. చూడటానికి టీవీ, కూర్చోవడానికి సోఫాలు, సేద తీరడానికి మంచాలు, ఆడుకోవడానికి ఆటబొమ్మలు వీటికి తోడు ప్రశాంతమైన పల్లె వాతావరణం. ఇవన్నీ చూస్తే ఇప్పడే వెళ్లాలనిపిస్తోంది కదా... కానీ ఇది మనుషుల కోసం కాదండోయ్. కేవలం కుక్కలకు మాత్రమే.

కేఫే ద లోకో రెస్టారెంట్... కుక్కలకు మాత్రమే
author img

By

Published : Jun 30, 2019, 2:49 PM IST

కేఫే ద లోకో రెస్టారెంట్... కుక్కలకు మాత్రమే

హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో ఉందీ కేఫే ద లోకో కుక్కల రెస్టారెంట్. తెలుగు రాష్ట్రాల్లో ఇదే మెట్టమెదటి కుక్కుల రెస్టారెంట్. అక్కడకు వెళ్లగానే ఏదైనా పల్లెటూరుకి వెళ్లామా అన్న భావన కలుగుతుంది. రెస్టారెంట్ చుట్టూ పచ్చని మొక్కలు, మధ్యలో మైదానం, పల్లెల్లో ఉండే గుడిసెలు మనల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. గేటు తీయగానే అక్కడ ఉండే కుక్కలు ప్రేమగా వచ్చి వాసన చూస్తాయి. మన వెంట తీసుకెళ్లే కుక్కలను కూడా స్నేహంగా వాటితో కలుపుకుంటాయి. వాటికి నచ్చిన ఆహారం తింటూ... మంచాలపై పడుకొని సేద తీరుతూ... ఆడుకుంటాయి. అక్కడున్న కుక్కలు అలా స్నేహంగా మెలగటానికి కారణం రెస్టారెంట్ నిర్వాహకులే.

రుచిరా సకర్వాల్, హేమంత్ సకర్వాల్ దంపతులు రెండేళ్లక్రితం సినీ నటి అమల చేతుల మీదుగా ఈ రెస్టారెంట్​ను ప్రారంభించారు. రుచిరా సాఫ్ట్​వేర్ ఉద్యోగి అయినప్పటికీ... కుక్కల మీద ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఈ రెస్టారెంట్​ను నిర్వహిస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్​లో రోడ్ల మీద తిరిగే కుక్కలను తీసుకెళ్లి పెంచుతున్నారు. వాటికి రోజూ ఆహారాన్నందిస్తూ దత్తత తీసుకోవాలనుకునే వాళ్లకు ఈ కుక్కలను అందిస్తుంటారు. నెలకోసారి వైద్యుల్ని రప్పించి తాము పెంచుతున్న కుక్కల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ 80 కుక్కలున్నాయని అవన్నీ దేశీయ జాతులకు చెందినవేనని రెస్టారెంట్ నిర్వాహకులు గర్వంగా చెబుతున్నారు.

10 రోజుల కుక్క నుంచి పదేళ్ల కుక్క వరకు ఈ రెస్టారెంట్​కు తీసుకెళ్లొచ్చు. కానీ వ్యాక్సిన్ వేసిన కుక్కలను మాత్రమే అనుమతిస్తారు. రెస్టారెంట్​లోకి అడుగుపెట్టగానే... గేటు దగ్గర ఓ నోట్ పుస్తకం ఉంటుంది. అందులో మనం తీసుకువచ్చిన కుక్కపేరు, ఆహారపు వివరాలు రాయాల్సి ఉంటుంది. కుక్కల కోసం ప్రత్యేకమైన మెనూ... అందులో సుమారు 50 రకాల ఆహార పదార్థాలుంటాయి. కుక్కల యజమానులకు కూడా అవసరమైన ఆహారాన్ని వండి వడ్డిస్తారు. కుక్కలు ఆడుకుంటుంటే యజమానులు హాయిగా సేదతీరుతుంటారు. ఇక్కడికి సినిమా, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలూ వస్తుంటారు.

ఇక్కడ కుక్కలు మాత్రమే కాదు కొన్ని పిల్లులు కూడా ఉన్నాయి. ఇక్కడకు వచ్చే వారు వాటితో కూడా ఆడుకోవచ్చు. వాటికి ఇష్టమైన ఆహారం కొని తినిపించవచ్చు. ఇక్కడకి రాలేనివారు తమ పప్పీల కోసం ఆహారాన్ని ఆన్​లైన్​లో కూడా ఆర్డర్ చేసే సదుపాయాన్ని కల్పించారు రెస్టారెంట్ నిర్వాహకులు. కేవలం పెంపుడు జంతువుల మీద ప్రేమతోనే... ఈరెస్టారెంట్​ని నిర్వహిస్తున్నామని రుచిరా తెలిపారు.

ఇవీ చూడండి: కుమురం భీం జిల్లాలో అటవీశాఖ సిబ్బందిపై రైతులు కర్రలతో దాడి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.