ETV Bharat / state

'కరోనా పరిస్థితులు టెలీమెడిసిన్​కు డిమాండ్​ పెంచాయి' - ప్రముఖ వైద్యురాలు పద్మజా లోకిరెడ్డి వార్తలు

ఆన్ లైన్ వైద్య సేవలు.. ఆస్పత్రిలో వైద్యున్ని సంప్రదించటానికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని ప్రముఖ వైద్యులు డాక్టర్ పద్మజా లోకిరెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే కరోనా మహమ్మారి పరిస్థితులు, రవాణా సమస్యలు, ప్రజల ఆసుపత్రి భయాలు టెలీ మెడిసిన్​కు అమాంతం డిమాండ్ పెంచేశాయని ఆమె తెలిపారు. ఈ విధానంలో వైద్యులు, పేషంట్లకు ఉన్న సౌలభ్యం, విస్తృత ప్రయోజనాల వల్ల.. వైరస్​ ప్రభావం తగ్గిన తర్వత కూడా టెలీమెడిసిన్ హవా కొనసాగుతుందని అంచనా వేశారు. వైద్యుని వద్ద, పేషంట్ ఓ మెరుగైన టెలీ కన్సల్టేషన్ ద్వారా ఏవిధంగా చికిత్స పొందవచ్చు, ఎలాంటి సమస్యలను ఈ విధానం ద్వారా నయం చేసుకోవచ్చు వంటి విషయాలను అపోలో సీనియర్ వైద్యులు డాక్టర్ పద్మజా లోకిరెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రవీణ్​ కుమార్​​ ముఖాముఖి.

doctors'కరోనా పరిస్థితులు టెలి మెడిసిన్​కు డిమాండ్​ పెంచాయి'
'కరోనా పరిస్థితులు టెలి మెడిసిన్​కు డిమాండ్​ పెంచాయి'
author img

By

Published : Sep 8, 2020, 7:45 AM IST

Updated : Sep 8, 2020, 9:35 PM IST

'కరోనా పరిస్థితులు టెలీమెడిసిన్​కు డిమాండ్​ పెంచాయి'

టెలీమెడిసిన్​కు సంబంధించి ప్రస్తుత ఆవశ్యకత, ట్రెండ్ ఎలా ఉంది ?

ఆసుపత్రికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. రవాణా సమస్యలు సైతం సరిగా లేకపోవటం, సుదూర ప్రాంతాలనుంచి ఆసుపత్రులకు వచ్చే వారికి ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇవన్నీ టెలీ కన్సల్టేషన్స్​కు డిమాండ్ పెంచేశాయి. టెలీమెడిసిన్ అనేది కొత్త ప్రక్రియేం కాదు. పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా అమల్లో ఉంది. భారత్​లో కొవిడ్ మహమ్మారి కారణంగా ఈ విధానం వేగంగా ప్రజల్లోకి వెళ్లింది. కరోనాకు మందు, కొవిడ్ తర్వాత వినియోగదారులు 10 నుంచి 20 రెట్లు పెరిగారు.

ఏ వ్యాధుకు టెలీ కన్సల్టేషన్స్ పొందవచ్చు. ఎంతటి వ్యాధి తీవ్రత వరకు ఇది ఉపయోగకరం.?

డయాబెటిక్ వంటి దీర్ఘాకాలిక రోగులకు.. వ్యాధుల ఫాలోఅప్​కు, రిపోర్టుల విశ్లేషణకు, చర్మసంబంధ వ్యాధులు, దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ రోగాలకు ఈ ప్రక్రియ చాలా దోహదకరం.

విదేశాలతో పోలిస్తే.. భారత్​లో ఈ రకమైన సేవలు అందించేందుకు ఎలాంటి సమస్యలున్నాయి. సవాళ్లను ఎలా అధిగమిస్తున్నారు.?

ప్రారంభంలో సమస్యలు సాధారణం. కాలక్రమంలో ఇవి రిసాల్వ్ అవుతాయి. పేషంట్ వైపు నుంచి మంచి ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ ఫోన్ సదుపాయం ఉండాలి. పేషంట్ జబ్బు గురించి కనీస పరిజ్ఞానం ఉండాలి. రిపోర్టులు అప్ లోడ్ చేసే పరిజ్ఞానం అవసరం. సమస్యను వివరించలేరు అందరూ.. పేషంట్ టచ్ మిస్ అవుతుంది. ఏది ముఖ్యమో, అది అప్రధాన్యమో రిపోర్టులలో పేషంట్లకు అర్థం కాదు. ఇదంతా టైం బీయింగ్, కమ్యూనికేషన్​ గ్యాప్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. టెలీమెడిసిన్ అనేది ఒక స్క్రీనింగ్ దశ. మామూలు డాక్టర్ కన్సల్టేషన్స్​ను ఇది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు. ఆడియో, విజువల్ గ్యాప్​లు ఉంటాయి. సమస్యలను రాసి డాక్టర్​కు అప్ లోడ్ చేయాలి. పరీక్షలను డాక్టర్ అడిగినట్లుగా అప్​లోడ్ చేయాలి. హోం కేర్ ఇన్వెస్టిగేషన్, మెడికేషన్ డెలివరీ టెలీమెడిసిన్ కు అదనపు సౌలభ్యాన్ని అందిస్తుంది. రెండు మూడు సార్లు టెలీమెడిసిన్ విధానం ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే.. డాక్టర్​ను ఫిజికల్ గా సంప్రదించాలి.

పేద, దిగువ మధ్యతరగతి, గ్రామీణ ప్రాంత వాసులు ఈ సేవలను ఏ మేరకు వినియోగించుకుంటున్నారు. వీలైనంత ఎక్కువ మందికి ఈ సేవలు చేరువచేసేలా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.?

టెలీమెడిసిన్​పై కనీస పరిజ్ఞానం లేని వారికి టెలీ కన్సల్టేషన్ చేయటం కొంత కష్టమే. ఫాలోవప్ పేషంట్లకు ఇది చాలా ఉపయోగకరం. చదువుకోని వారు కూడా ఒక్కసారి కన్సల్ట్ అయితే.. వారు అలవాటు పడుతారు. సమస్య ఏంటో.. ఇతర మెడికల్ సమస్యలు ఏమున్నాయి, ఎలర్జీస్, మందులతో సిద్ధంగా ఉండి డాక్టర్​కు వివరించాలి.

టెలీ కన్సల్టేషన్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని అంచనా వేస్తున్నారు.?

టెలీ కన్సల్టేషన్స్ డిమాండ్ భవిష్యత్తులోనూ పెరుగుతుంది. ఖర్చు తక్కువ, ఫీసబిలిటీ, కంఫర్ట్​తో ఈ విధానానికి ప్రాచుర్యం పెరుగుతుంది. కొద్ది వరకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా వ్యాధి నిర్ధరణ సరిగ్గా జరగక కొద్దిమందిలో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అది వైద్యులకు సైతం ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. కాలం, అనుభవం వీటికి పరిష్కారాలు చూపుతాయి.

ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్​ ఫారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్

Last Updated : Sep 8, 2020, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.