ETV Bharat / state

తాత పేరు మీద డాక్టర్ మనవరాలి దాతృత్వం

లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య , సెక్యూరిటీ సిబ్బందికి పీజీ వైద్య విద్యార్థిని డా.చాందిని కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. వారి ఆర్థిక పరిస్థితికి గమనించిన పీజీ వైద్య విద్యార్థిని తన వంతు సాయంగా 250 మంది సిబ్బందికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

కొత్త శంకరయ్య జ్ఞాపకార్థం ఉస్మానియాలో సరుకుల పంపిణీ

author img

By

Published : Apr 28, 2020, 9:05 PM IST

కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఉస్మానియా ఆసుపత్రిలో విధులు నిర్వహించే సెక్యూరిటీ సిబ్బందికి నిత్యావసర సరుకులను అందించారు. గతంలో కంటే వీరికి పని ఒత్తిడి రెట్టింపయ్యిందని వైద్యురాలు పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో తమ తాత కొత్త శంకరయ్య జ్ఞాపకార్థం ఉస్మానియాలో పిజీ విద్యార్థిని డాక్టర్ చాందిని కుటుంబ సభ్యుల సహకారంతో 250 మంది సిబ్బందికి సరుకులు పంచారు.

సరుకులు పంచి కృతజ్ఞతలు !

లాక్ డౌన్ వల్ల ఆస్పత్రి సిబ్బంది పడుతున్న ఇబ్బందులను చూసి డాక్టర్ చాందిని చలించారు. తన తాత జ్ఞాపకార్థం నెలకు సరిపడా కిరాణా సామగ్రిని పంచడం అభినందనీయమని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ కొనియాడారు. సరుకులను అందించినందుకు డా. చాందినికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. లాక్ డౌన్ సమయంలో ఆస్పత్రి సిబ్బంది ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా 24 గంటలు పాటు పనిచేస్తున్నారని ఆమె కొనియాడారు. వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల పరిస్థితులను గమనించి తన వంతుగా సాయం చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని డాక్టర్ చాందిని స్పష్టం చేశారు.

కొత్త శంకరయ్య జ్ఞాపకార్థం ఉస్మానియాలో సరుకుల పంపిణీ

ఇవీ చూడండి : సెప్టెంబర్​ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.