హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో మళ్లీ వైద్య సేవలు నిలిచిపోయాయి. కెరీర్ అడ్వాన్స్ మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... మెడికల్ అసిస్టెంట్ ప్రోఫెసర్లు, మెడికల్ అసోసియెట్ ప్రోఫెసర్లు, జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. అత్యవసర కేసులు మినహా అన్నీ వైద్య సేవలు బహిష్కరించారు. వైద్య రంగంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని... 65 ఏళ్లకు పెంచిన వయో పరిమితిని 58కి తగ్గించాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి పెంపు వల్ల తమకు ప్రమోషన్లు ఆలస్యమై.. తాము జూనియర్లుగానే మిగిలి పోతామని వాపోయారు.
ఇదీ చూడండి: కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం