ETV Bharat / state

గాంధీ ఆస్పత్రి సిబ్బందిపై పోలీసులకు డాక్టర్ వసంత్​ ఫిర్యాదు

గాంధీ ఆస్పత్రి సిబ్బందిపై ఇటీవల డైరెక్టర్ ఆఫ్​ హెల్త్​కు సరెండర్ అయిన వైద్యుడు వసంత్ ఇవాళ చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి చెందిన కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

doctor vasanth complinte
ఆస్పత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైద్యుడు వసంత్​
author img

By

Published : Feb 14, 2020, 6:09 PM IST

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న గాంధీ ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల డైరెక్టర్ ఆఫ్​ హెల్త్​కు సరెండర్ అయిన వైద్యుడు వసంత్ పోలీసులను ఆశ్రయించాడు. మీడియాకి తన ఆడియో, వీడియోలను విడుదల చేయడమే కాకుండా... వాట్సప్​లో వైరల్​ చేసినట్టు పేర్కొన్నారు. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిలకల గూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

doctor vasanth complinte
ఆస్పత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైద్యుడు వసంత్​

ఆస్పత్రి ఆర్​ఎంవోని దుర్భాషలు ఆడడం సహా వివిధ కారణాలతో వైద్యుడు వసంత్​ని ఆస్పత్రి అధికారులు డీహెచ్ కార్యాలయానికి సరెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పలు నాటకీయ పరిణామాలు జరిగిన నేపథ్యంలో గురువారం వసంత్​కి సంబంధించిన పలు ఆడియో, వీడియోలు గాంధీ అధికారులు విడుదల చేశారు. మెడికల్ దుకాణాల్లో లంచాలు తీసుకోవడం సహా పలువురిని లంచం డిమాండ్​ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వసంత్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదీ చూడండి: 'ఆరోగ్య శాఖ అవినీతిమయం.. అభద్రతలో ప్రజలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.