హైదరాబాద్ లో లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ‘వీ ఫర్ విమెన్’ వ్యవస్థాపకురాలైన డాక్టర్ ప్రతిభా లక్ష్మి అండగా నిలుస్తున్నారు. ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్న వారికి నిత్యాసవర సరుకులతో పాటు, ఎన్ 95 మాస్క్‌లను పంపిణీ చేశారు. ముఖ్యంగా దినసరి కూలీలు, మురికివాడలో ఉంటున్న పేదలకు వీటిని అందిస్తూ తమ మంచి మనసును చాటుకుంటున్నారు.
వృత్తి పరంగా వైద్యురాలైన ప్రతిభా లక్ష్మీ.... వైద్యంతో పాటు ఇలా తనకు చేతనైన సహాయం చేస్తున్నారు. ఈ కష్ట కాలంలో ప్రతి ఒక్కరు ఎదుటి వారికి సహాయం అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పలువురు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : మొండిగా ఉంటేనే.. మహమ్మారిని ఎదుర్కోగలం : కేసీఆర్