టీకాలతోనే కొవిడ్ మహమ్మారి నుంచి రక్షణ సాధ్యమని ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కొవిడ్ టీకాలపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లన్నీ సమర్థమైనవేనని చెప్పారు. వ్యాక్సినేషన్ సమర్థంగా జరిగితే మూడోదశ ముప్పు ఉండబోదని స్పష్టం చేశారు.
ప్రజల నిర్లక్ష్యం, ఎన్నికల సభలు, వైరస్ మ్యుటేషన్‌తోనే ఉద్ధృతి అవుతోందని అన్నారు. టీకాలు తీసుకున్నవారిలో వైరస్ వచ్చినా ప్రాణహానీ ఉండదని వెల్లడించారు. రెండోదశలో కొవిడ్ లక్షణాల్లో కొంత మార్పులు వచ్చాయని... ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కొవిడ్ నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని స్వీయరక్షణలు తీసుకుంటూ మనోధైర్యంతో ఉంటే.. కరోనాను జయించవచ్చంటున్న నాగేశ్వరరెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి నారాయణ ముఖాముఖి.
ఇదీ చూడండి : పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాల కొరత