ETV Bharat / state

ఆ రోగులు ఆక్సిజన్ అందక చనిపోలేదు: డీఎంఈ రమేశ్​ రెడ్డి - కోఠి ఆస్పత్రిని సందర్శించిన డీఎంఈ రమేశ్​

ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్​ బాధితులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలున్నాయని డీఎంఈ రమేశ్​ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ కింగ్ కోఠీ ఆస్పత్రిని సందర్శించిన ఆయన... ఆక్సిజన్ అందక కరోనా రోగులు చనిపోయారనడంలో నిజం లేదన్నారు.

dme ramesh
dme ramesh
author img

By

Published : May 10, 2021, 5:45 PM IST

Updated : May 10, 2021, 6:56 PM IST

ఆక్సిజన్​ అందక కొవిడ్​ బాధితులు మృతి చెందుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని డీఎంఈ రమేశ్​ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్​ కింగ్​ కోఠి ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఆక్సిజన్​ సరఫరాను 24 గంటల పాటు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఐఏఎస్​ కమిటీ ఉందని తెలిపారు. రోగుల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని... పరిస్థితి విషమించడంతోనే మరణిస్తున్నారని తెలిపారు.

ఎక్కడ ఆక్సిజన్ అవసరమున్నా... వెంటనే అందించే ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ లేకున్నా... నాలుగైదు గంటలపాటు వినియోగించుకునే సాంకేతికత అందుబాటులో ఉందని రమేశ్​ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో పడకలకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తున్నామన్నారు.

ఆ రోగులు ఆక్సిజన్ అందక చనిపోలేదు: డీఎంఈ రమేశ్​ రెడ్డి

ఇదీ చూడండి: సరిహద్దులో పోలీసుల ఆంక్షలు.. బాధితుల విజ్ఞప్తులు..

Last Updated : May 10, 2021, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.