ETV Bharat / state

DK Aruna on Congress 6 Guarantee Schemes : 'కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు.. ముందుగా ఆ మూడు హామీలు ఇవ్వాలి'

DK Aruna Criticise on Congress 6 Guarantee Schemes : ప్రపంచ దేశాల్లో భారత్​ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తుంటే.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందని.. కాంగ్రెస్ పార్టీ ముందుగా మూడు హమీలు ఇవ్వాలని హితవు పలికారు.

DK Aruna fires on BRS
DK Aruna on Congress 6 Guarantee Schemes
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2023, 4:01 PM IST

DK Aruna on Tukkuguda Congress Sabha : కాంగ్రెస్, బీఆర్​ఎస్​, మజ్లీస్ తోడు దొంగలుగా ఉండి.. బీజేపీపైన తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ(BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో భారత్​ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తుంటే.. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. దేశంలో వైషమ్యాలు, అభివృద్ధికి ఆటంకాలు సృష్టించడం కాంగ్రెస్ పార్టీకి సమంజసమా అని ప్రశ్నించారు.

DK Aruna Comments on PRLIS : 'పాలమూరు భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారు..?'

DK Aruna fires on Congress : కాంగ్రెస్ తుక్కుగూడ విజయభేరి సభలో ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్(Congress) పార్టీ ముందుగా ప్రజలకు మూడు గ్యారెంటీలు ఇవ్వాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారారని గ్యారెంటీ ఇవ్వాలన్నారు, స్కాంలు, కుంభకోణాలు చేయమని, తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించమని గ్యారంటీ ఇవ్వాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోయిందని.. మత విద్వేషాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి బీజేపీపై విషం చిమ్మి లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారా?, 4 వేల ఫించన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. అధికార ఆకాంక్ష తప్పితే దేశ అభివృద్ధి మీద ధ్యాస లేదన్నారు. విచ్చలవిడిగా ఉచితాలతో కర్ణాటకలో ఆర్టీసీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని.. ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారన్నారు.

DK Aruna: 'వాస్తవాలు చెబితే కాంగ్రెస్​ నేతలకు అంత రోషమెందుకు..?'

DK Aruna fires on BRS : తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని స్పష్టం చేశారు. కవిత, కేసీఆర్ లేఖ రాస్తే.. మోదీ మహిళా బిల్లు పెడుతున్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళలను గౌరవించే అలవాటు కేసీఆర్​కు లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు కనీసం 15 శాతం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. బీఆర్​ఎస్​ కమిటీల్లో మహిళలకు కీలక బాధ్యత ఎక్కడైనా ఉందా ? అని ప్రశ్నించారు.

"ప్రపంచ దేశాల్లో భారత్​ను అగ్ర స్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తుంటే.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముందు ఆ మూడు గ్యారంటీలు ఇవ్వాలి. కవిత, కేసీఆర్ లేఖ రాస్తే.. మోదీ మహిళా బిల్లు పెడుతున్నట్లు మాట్లాడుతున్నారు. బీఆర్​ఎస్​ కమిటీల్లో మహిళలకు కీలక బాధ్యతలు ఎక్కడ ఇవ్వలేదు". - డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు

DK Aruna on Congress 6 Guarantee Schemes కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు.. ముందుగా ఆ మూడు హామీలు ఇవ్వాలి

Kishan Reddy Fires on Telangana Government : 'రాబోయే ఎన్నికల్లో చిన్నపొరపాటు చేసినా.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మర్చిపోవాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.