ETV Bharat / state

విక్రమ్​ గౌడ్​ను భాజపాలోకి ఆహ్వానించిన డీకే అరుణ

మాజీ మంత్రి ముఖేష్​ గౌడ్​ కుమారుడు విక్రమ్​ గౌడ్​ను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ భాజపాలోకి ఆహ్వానించారు. తమ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

author img

By

Published : Nov 26, 2020, 7:02 PM IST

dk-aruna-invites-vikram-goud-to-join-bjp
విక్రమ్​ గౌడ్​ను భాజపాలోకి ఆహ్వానించిన డీకే అరుణ

భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్​తో భేటీ అయ్యారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్​ను భాజపాలోకి ఆహ్వానించామని డీకే అరుణ తెలిపారు. తమ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని.. యువ నాయకుడైన విక్రమ్ గౌడ్​కు రాజకీయ భవిష్యత్తు ఉందన్నారు. ఆయన చేరిక వల్ల పార్టీకి, ప్రజలకు మేలు జరుగుతుందని.. విక్రమ్ తండ్రి ముఖేష్ గౌడ్​తో మంత్రిగా పని చేసిన చనువుతో తాము ముందుకొచ్చి ఆహ్వానించామని పేర్కొన్నారు.

త్వరలో విక్రమ్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపారని ఆమె పేర్కొన్నారు. కార్యకర్తలు, ప్రజల శ్రేయస్సు కోసం పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని.. ఏ పార్టీలో ఎప్పుడు చేరుతాననే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని విక్రమ్ గౌడ్ స్పష్టం చేశారు. అంతకు ముందు ఎంజే మార్కెట్​లోని విక్రమ్ గౌడ్ నివాసంలో... కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్ ఆయనను​ బుజ్జగించే ప్రయత్నం చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత గ్రేటర్ ప్రజలపైనే ఉంది: కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.