రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. 2020- 21 యాసంగి సీజన్‌కు సంబంధించి ఈ పథకం కింద పెట్టుబడి సాయం ప్రభుత్వం అందిస్తోంది. సోమవారం వరకు 55 లక్షల 58 వేల 393 మంది రైతులకు ప్రభుత్వం అందజేసింది. 111. 22 లక్షల ఎకరాలకుగాను రూ. 5660.87 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా వ్యవసాయ శాఖ జమ చేసింది.
జిల్లాల వారీ పరిశీలిస్తే...
జిల్లాలు | మొత్తం పట్టాదారులు | పెట్టుబడిసాయం(రూపాయల్లో) |
ఆదిలాబాద్ | 1,21,944 | 184 కోట్ల 87 లక్షల 81 వేల 605 |
ఖమ్మం | 2,76,414 | 262 కోట్ల 75 లక్షల 23 వేల 858 |
జగిత్యాల | 1,91,824 | 169 కోట్ల 36 లక్షల 75 వేల 700 |
భద్రాద్రి కొత్తగూడెం | 1,18,174 | 134 కోట్ల 13 లక్షల 2,135 |
జనగామ | 1,41,544 | 154 కోట్ల 96 లక్షల 90 వేల 124 |
నల్గొండ | 4,09,389 | 446 కోట్ల 52 లక్షల 58 వేల 562 |
జయశంకర్ భూపాపల్లి | 97,915 | 96 కోట్ల 9 లక్షల 40 వేల 178 |
జోగులాంబ గద్వాల | 1,32,522 | 155 కోట్ల 42 లక్షల 69 వేల 738 |
కరీంనగర్ | 1,61,385 | 145 కోట్ల 62 లక్షల 97 వేల 766 |
మెదక్ | 2,10,311 | 167 కోట్ల 33 లక్షల 80 వేల 333 |
సిద్దిపేట | 2,59,242 | 237 కోట్ల 13 లక్షల 53 వేల 137 |
సంగారెడ్డి | 2,74,023 | 273 కోట్ల 32 లక్షల 64 వేల 593 |
సూర్యాపేట | 2,30,861 | 237 కోట్ల 13 లక్షల 53 వేల 137 |
కుమురం భీం ఆసిఫాబాద్ | 94,271 | 122 కోట్ల 53 లక్షల 79 వేల 727 |
రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 55 లక్షల 48 వేల 393 మంది రైతులకు రూ. 5, 660 కోట్ల 87 లక్షల 16 వేల 170 జమ చేసినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: 'సన్నబియ్యం పంపిణీ పేరిట తప్పుడు ప్రచారం చేస్తున్నారు'