ETV Bharat / state

గిఫ్ట్‌ ఏ స్మైల్‌: డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్లు అందజేత - గిఫ్ట్​ ఏ స్మైల్​ కార్యక్రమం తాజా వార్తలు

మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి తలసాని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్లను అందజేశారు. 1000 డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కుటుంబాలకు రూ. 2 లక్షల వరకు ఒక సంవత్సరం పాటు వైద్యసేవలు పొందే వెసులుబాటు కల్పించే విధంగా ఇన్సూరెన్స్ చేయించినట్లు తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు.

గిఫ్ట్‌ ఏ స్మైల్‌: డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్లు అందజేత

author img

By

Published : Jul 24, 2020, 6:47 PM IST

తెరాస రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి తలసాని ఫౌండేషన్‌.. ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్లను అందజేశారు. సికింద్రాబాద్‌ బుద్ధ భవన్‌లోని విజిలెన్స్, ఎన్ఫోర్స్‌మెంట్ కార్యాలయంలో డైరెక్టర్ విశ్వజిత్‌కు ఇన్సూరెన్స్ పత్రాలను సికింద్రాబాద్ పార్లమెంట్ తెరాస ఇంఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ అందించారు.

1000 డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కుటుంబాలకు రూ. 2 లక్షల వరకు ఒక సంవత్సరం పాటు వైద్యసేవలు పొందే వెసులుబాటు కల్పించే విధంగా ఇన్సూరెన్స్ చేయించినట్లు తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు. రూ. 20 కోట్ల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ. 35 లక్షలను తలసాని ఫౌండేషన్ ద్వారా చెల్లించారు. సేవా కార్యక్రమాలు చేయడంలో తలసాని ఫౌండేషన్ ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు.

ఇవీ చూడండి: కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.