హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గం పరిధి నల్లకుంట డివిజన్లో ఫీవర్ ఆస్పత్రి వద్ద 200 మంది జీహెచ్ఎంసీ కార్మికులకు తెదేపా సీనియర్ నేత ప్రవీణ్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశంలోనే అత్యధిక మిగులు బడ్జెట్‌తో నిలిచిన తెలంగాణలో నేడు ప్రజలు అన్నమో రామచంద్ర అనే దుస్థితికి సీఎం కేసీఆర్ తెచ్చారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం పంపించే బియ్యం ప్రజలెవరూ తినడానికి పనికి రాని స్థితిలో పురుగులు పట్టి ఉన్నాయని విమర్శించారు.
'మీరైనా 3 పూటలా భోజనం పెట్టించాలి'
లాక్డౌన్ అమలుకు ముందు నగర వాసులు తమ కష్టార్జీతంతో మంచి బియ్యం, పప్పులు కొనుక్కొని తిన్నారని స్పష్టం చేశారు. సాయం అందించే చోట తెరాస కార్యకర్తలు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ నగరంలో పేదల ఆకలి గుర్తించి... వారికి మూడు పూటలా భోజనం అందించే ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు.