హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కృష్ణానది నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలిస్తున్న పైపులైనుకు బండ్లగూడ వద్ద లీకేజీ ఏర్పడింది. లీకేజీ మరమ్మతు దృష్ట్యా బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుందని జలమండలి ప్రకటించింది.
36 గంటల అంతరాయం
అలియాబాద్, మిరాలాం, కిషన్ బాగ్, రియాసత్ నగర్, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, అస్మాన్ ఘాడ్, చంచల్ గూడ, యాకుత్‌పుర, మలక్‌పేట్, మూసారాంబాగ్, బొగ్గులకుంట, అఫ్జల్ గంజ్, హిందీనగర్, నారాయణ గూడ, అడిక్ మెట్, శివం టెంపుల్, చిలకలగూడ, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో మంచి నీటి అంతరాయం ఏర్పడనుంది.
రెండ్రోజుల అంతరాయం
గండిపేట నుంచి ఆసిఫ్‌నగర్ ఫిల్టర్‌బెడ్‌కు నీటి తరలింపులో పైపులైన్ కాలువ మరమ్మతులు... ఆసిఫ్‌నగర్ ఫిల్టర్‌బెడ్ క్లీనింగ్ చేస్తున్నందున 26, 27 తేదీల్లో కాకతీయ నగర్, సాలార్జంగ్ కాలనీ, పార్ట్ పద్మనాభ నగర్, కుందన్‌బాగ్, వినయ్ నగర్ కాలనీ, చింతల్‌బస్తీ, హుమాయున్ నగర్, సయ్యద్ నగర్, ఏసీ గార్డ్స్, ఖైరతాబాద్, మల్లేపల్లి, బోయిగూడ కమాన్, అజంపుర, నాంపల్లి, దేవిబాగ్, అఫ్జల్ సాగర్, సీతారాంబాగ్, హబీబ్‌నగర్, ఎస్‌ఆర్‌టీ, జవహర్‌నగర్, పీఎన్‌టీ కాలనీ, సాయన్న గల్లీ, అశోక్‌నగర్, జ్యోతి నగర్, వినాయక్ నగర్, మైసమ్మ బండ, ఎంసీహెచ్ క్వార్టర్స్, సెక్రటేరియట్, రెడ్‌హిల్స్, హిందీ నగర్, గోడెకీకబర్, గన్‌ఫౌండ్రీ, దోమలగూడ, లక్డీకపూల్, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి ప్రాంతాలలో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.
- ఇదీ చూడండి : 'రాష్ట్రానికి చేసిందేమీ లేదు కానీ పైగా నిందలా...?'